Radhika Merchant : వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ , నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీకి త్వరలో జరుగనుంది. ప్రముఖ వ్యాపారి కూతురు రాధిక మర్చంట్‌తో వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

మంగళవారం, ఈ జంట తమ మెహందీ వేడుకను నిర్వహించారు పెద్దలు. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు రాధిక అందమైన డిజైనర్ పింక్ లెహెంగా సెట్‌ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన ఈ లెహంగాలో పిక్చర్ పర్ఫెక్ట్గా కనిపించి అందరిని అలరించింది.

మంగళవారం రాత్రి, డిజైనర్లు అబు జానీ సందీప్ ఖోస్లా అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో రాధికా మర్చంట్ మెహందీ ఫంక్షన్ పిక్స్‌ను పోస్ట్ చేశారు. ఈ పిక్ కు ది హ్యూస్ ఆఫ్ జాయ్ అని క్యాప్షన్‌ను జోడించారు. రాధిక మర్చంట్ తన మెహందీ వేడుకలో పూల డిజైన్స్ అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ కస్టమ్-మేడ్ మల్టీ-కలర్ రేషమ్ లెహంగాలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ లెహెంగాతో రాధిక కళంక్ సినిమా నుంచి ఫేమస్ అయిన ఆలియా భట్ డ్యాన్స్ చేసి ఘర్ మోరే పరదేశీయ పాటకు ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక ఈ లెహంగా డిజైన్ అంశాలకు వస్తే. బహుళ-రంగు పూల ఎంబ్రాయిడరీ, అద్దాల అలంకరణలు, విశాలమైన పట్టీ అంచులు కలిగిన అందమైన పింక్-హ్యూడ్ రేషమ్ లెహంగాలో రాధికా మర్చంట్ చాలా అందంగా కనిపించింది. హాఫ్ స్లీవ్స్ కత్తిరించిన అంచు, క్లిష్టమైన అలంకారాలతో వచ్చిన బ్లౌజ్‌ను ఈ లెహంగాకు జోడించింది రాధిక.

తన భుజంపై ఈ లెహెంగాను సెట్ అయ్యేలా గులాబీ రంగు దుపట్టాను వేసుకుని తన లుక్‌ను పూర్తి చేసింది. ఈ లెహంగాకు మ్యాచింగ్‌గా వధువు పచ్చ ,బంగారు రంగులో ఉన్న ఆభరణాలను ఎంచుకుంది. మెడలో భారీ నెక్లెస్, చోకర్ వేసుకుంది. నుదుటన పాపిటబిల్ల పెట్టుకుని మ్యాచింగ్ జుమ్కీలను, ఉంగరాలను అలంకరించుకుంది.

రాధిక కనులకు వింగెడ్ ఐలైనర్, పెదాలకు పింక్ లిప్ షేడ్ దిద్దుకుని, కనుబొమ్మలను డార్క్ చేసుకుని, సూక్ష్మమైన ఐ షాడో వేసుకుని గ్లామ్ లుక్స్‌లో అదరగొట్టింది. పూల అలంకరణలతో ఆమె తన హెయిన్ను స్టైలిష్‌గా మార్చుకుంది. రాధికను ఈ లుక్ లో చూసిన వారంతా హీరోయిన్లు కూడా ఆమె ముందు పనికిరారని కితాబిస్తున్నారు. ఎంతైనా అంబానీ చిన్న కోడలు కదా ఆమాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.