Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఈ యాత్ర ముగింపు కార్యక్రమం ఈరోజు సాయంత్రం శ్రీనగర్‌లో జరగనుంది. యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రాహుల్ పర్యటించారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాద యాత్రకు నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ, యాత్ర ఆదివారం ముగియడంతో శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పార్టీ నాయకులు జెండా ఎగురవేసే కార్యక్రమంలో హాజరయ్యారు. ఇక ఈ ముగింపు వేడుకలకు పలు పార్టీ నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

సోమవారం శ్రీనగర్‌లోని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంతో భారత్ జోడో యాత్ర లాంఛనంగా ముగుస్తుంది. ఆ తర్వాత షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు చేరుతాయని భావిస్తున్నారు. యాత్ర ముగింపు వేడుకలకు లో చేరాలని 21 కీలక ఎన్డీయేతర పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ సీనియర్ వ్యూహకర్త ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ , భారత రాష్ట్రీయ సమితి తో సహా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలను మార్చ్‌కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఐదు రాజకీయ పార్టీలు AIADMK, YSRCP, BJD, AIMIM AIUDF-లకు ఆహ్వానం పంపలేదు.

యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధి యాత్రలో తన అనుభవాలను వ్యక్తం చేశారు. ఈ యాత్ర తన జీవితంలో అత్యంత అందమైన లోతైన అనుభవాలలో ఒకటి అని రాహుల్ గాంధీ అన్నారు. నేను లక్షలాది మందిని కలిశాను, వారితో స్వయంగా మాట్లాడాను అని అన్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. యాత్ర యొక్క లక్ష్యం భారతదేశాన్ని ఏకం చేయడం. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ద్వేషం, హింసకు వ్యతిరేకంగా చేసిన యాత్ర. మా ఈ యాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. నిజానికి ఇంత ప్రేమతో కూడిన స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేదు.

భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమై 12 రాష్ట్రాలు , రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుండా వెళ్లి 4,080 కి.మీ. ప్రయాణించి హర్యానా, పంజాబ్ , జమ్మూ కాశ్మీర్ వరకు యాత్ర కొనసాగింది. మార్చ్ మొత్తం మీద రాహుల్ గాంధీ 12 బహిరంగ సభలు, 100కి పైగా కార్నర్ మీటింగ్‌లు, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, 275కి పైగా ప్లాన్డ్ వాకింగ్ ఇంటరాక్షన్లు 100కి పైగా సిట్టింగ్ ఇంటరాక్షన్లలో ప్రసంగించారు.