Rahul Ramakrishna : రాహుల్ రామకృష్ణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు. వరుస సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండీ కమెడియన్‌గా మారాడు. రాహుల్ సోషల్ మీడియా బాగా యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో ముచ్చటిస్తూ వారికి దగ్గరగా ఉండేందుకు యత్నిస్తాడు. తాజాగా ఎలాంటి ప్రశ్నలు అడగాలని నెటిజన్లకు చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రశ్నల్లో ఒకటి.. దానికి రాహుల్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘నాకు బోర్ కొడుతోంది. సినిమాలు, సాహిత్యం, సంగీతం గురించి ఏదైనా నన్ను అడగండి. ఆసక్తికరమైన వాటికి సమాధానం ఇస్తా..’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇంత ఛాన్స్ ఇచ్చాక నెటిజన్లు ఊరుకుంటారా? ప్రశ్నల వర్షమే కురిపించారు. తాగేసి ట్వీట్స్ వేసిన సందర్భాలు ఉన్నాయా గురు? అని అడిగితే.. చాలా సార్లు అంటూ రాహుల్ నిజం ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంత నిజాయితీగా ఒప్పుకున్న రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక మరికందరు.. మీరు ఇటీవల చదివిన పుస్తకం ఏది..? ఏ వెబ్ సిరీస్ మీకు ఇష్టం..? అని ప్రశ్నించారు. అయితే అన్ని ప్రశ్నలకు ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఇంటెస్ట్రింగ్ సమాధానాలిచ్చాడు రాహుల్.
Rahul Ramakrishna : దశ తిరిగింది.. బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు..
రాహుల్ రామకృష్ణ మెకానికల్ ఇంజినీరినింగ్ చదివాడు. కానీ సినిమాలపై ఆశను చంపుకోలేక ఆ దిశగా అడుగులు వేశాడు. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కానీ బాగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం అర్జున్ రెడ్డి. ఇక ఆ తరువాత రాహుల్ దశ తిరిగింది. వరుస సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సైతం అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాలో కూడా రాహుల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొత్తానికి ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యాన్స్‌తో మాత్రం ముచ్చటిస్తూనే ఉన్నాడు.
Taagesi tweets esinaa sandarbhaalu unnayaaa,Guru ??
— Tom (@Nenu_jerry) August 5, 2022