Rajamouli : ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపించి ఆస్కార్ అవార్డులను సైతం కొల్లగొట్టి అందరి ఆల్‌టైమ్ ఫేవరెట్‌గా మారిపోయారు దర్శకధీరుడు రాజమౌళి. అంతర్జాతీయ దిగ్గజాలకు తెలుసు సినిమాను చేరువు చేసి సభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జక్కన్న హాలీవుడ్ లోనూ తన టాలెంట్ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ ఫిల్మ్‌మేకర్ తాను హాలీవుడ్‌లో సినిమా తీయాలనుకుంటున్నట్లు తన ఇన్నర్ గోల్ ను బహిర్గతం చేశారు. అయితే ఏం చేయాలనే దానిపై మాత్రం కొంచెం గందరగోళంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారతదేశంలో తాను చేసిన ప్రాజెక్టులలో సృజనాత్మకతను, ఫైనల్ కట్‌లను ప్రస్తుతం ఆశ్వాదిస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్‌ఆర్‌ఆర్ నటులు రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్‌లను వారి హాలీవుడ్ ప్లాన్‌ల గురించి అడుగుతున్నట్లే, దర్శకుడు రాజమౌళికి కూడా హాలీవుడ్‌లో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గత వారం గోల్డెన్ గ్లోబ్స్ లో ఆర్‌ఆర్‌ఆర్ సాధించిన పెద్ద విజయం తర్వాత, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ , జేమ్స్ కామెరాన్‌లను కలిశారు. ఇద్దరు దర్శకులు ఆర్ఆర్ఆర్ టీమ్ ను రాజమౌళి పనితీరును ప్రశంసించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ని ప్రదర్శించడానికి ఇప్పటివరకు యుఎస్‌కి కొన్ని ట్రిప్పులు చేశారు ఫిల్మ్‌మేకర్. ఈ చిత్రానికి అమెరికాలో వచ్చిన రెస్పాన్స్‌తో నోటి నుంచి మాట రాలేదు. అందుకే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ మరీ చూసే సినిమాలను తీయాలనుకుంటున్నానని అని పంచుకున్నారు.

అమెరికన్ మ్యాగజైన్ ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ అవార్డిస్ట్ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ, రాజమౌళి తన అభిప్రాయాలను పంచుకున్నారు, హాలీవుడ్‌లో సినిమా తీయాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఫిల్మ్‌మేకర్ కల అని నేను భావిస్తున్నాను. నేను భిన్నంగా లేను. నేను ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఏం చేయాలనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌లో ఉన్నానని కూడా చెప్పారు. సొంత గడ్డపైన, తన ప్రాజెక్టుల్లో మరింత సృజనాత్మక శక్తిని కట్స్ ను ఆస్వాదిస్తానని వెల్లడించారు. ఇండియాలో నేను డిక్టేటర్‌ని. సినిమా ఎలా తీయాలో ఎవరూ నాకు చెప్పరు అని అయన పేర్కొన్నారు. హాలీవుడ్‌లో సినిమా తీయాలనుకుంటే మొదటగా అక్కడి వారిలో ఒకరితో కొలాబరేట్ అవుతానని చెప్పారు.

అవార్డు షోలో విజయం సాధించిన తరువాత RRR సినిమా ఇప్పుడు హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్‌లో మూవీ టీమ్‌కు డైరెక్టర్‌కు మంచి పేరు, గుర్తింపు లభించింది. చాలా వరకు దేశాల్లో రాజమౌళికి పాపులారిటీ పెరిగింది. ఈ సమయంలో రాజమౌళి నెక్స్ట్ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్‌లో ఉంటుందోననన్న విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాప్‌గా మారింది. మరి ఈ జక్కన్న డైరెక్షన్ ఎటువైపుకు వెళుతుందో చూడాలంటే వేచి చూడాల్సిందే.