RRR: దుబాయ్‌లో ధూం ధాం… రాజమౌళి పక్క ప్లాన్
దర్శక ధీరుడు రాజమౌళి భారీ రేంజ్ లో రూపొందించిన ఈ సినిమాను జనవరి నెలలో రిలీజ్ చేయాలని ప్రమోషన్స్ కూడా చేపట్టారు. అయితే ఓమైక్రాన్ ఎఫెక్ట్‌తో రిలీజ్ పోస్ట్ పోన్ చేసి మార్చి నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేనందుకు రెడీ అయ్యారు. మార్చి 25న ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయమై భారీగా ప్లాన్స్ చేస్తున్నారు జక్కన్న. ఈ మేరకు దుబాయ్‌లో ఓ భారీ ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందిన RRR మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు అంతా ఖుషీ అయిపోయాలా విడుదలకు ముందే భారీ స్కెచ్చేశారట రాజమౌళి. మార్చి తొలివారం నుంచే ప్రమోషన్స్ షురూ చేయాలని రాజమౌళి టీమ్ డిసైడ్ అయిందని సమాచారం. ఈ మేరకు దుబాయ్‌లో ధూం ధాం చేసేందుకు జక్కన్న టీమ్ ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోందని తెలుస్తుంది.
ఈ వేడుక మునుపెన్నడూ చూడనివిధంగా చాలా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్నారట జక్కన్న. ఈ కార్యక్రమానికి ఓ హాలీవుడ్ సూపర్ స్టార్‌ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అన్ని హంగులతో మార్చి 15న ఈ ఈవెంట్ జరగబోతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి దుబాయ్ ఈవెంట్ ఎప్పుడో ప్లాన్ చేశారట రాజామౌళి. కానీ.. వాయిదాలు మీద వాయిదాలు పడి చివరికి మార్చి నెలకు పోస్ట్ పోన్ అయింది.
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేసారు. అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలల్లో పోషించారు.