తమ అభిమాన హీరోని వెండితెరపై చూసి ఇప్పటికే రెండేళ్లు దాటేయడంతో ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఆతృతగా ఎదరు చూస్తున్నారు. దానికి సమయం దగ్గర పడనుంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘రాధే శ్యామ్’ సినిమా విడుదలవుతుంది. బుధవారం ‘రాధే శ్యామ్’ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. డార్లింగ్ అభిమానులు ఆనందంలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ ఏమిటా గుడ్ న్యూస్ అని అనుకుంటున్నారా? పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళితో మూవీ చేయబోతున్నట్లు డార్లింగ్ ప్రభాస్ చెప్పారు.
ముంబైలో జర్నలిస్ట్ మళ్లీ రాజమౌళితో సినిమా ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా దానికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ ‘మళ్లీ రాజమౌళి నాతో ఎప్పుడు సినిమా చేస్తాడో నాకు తెలియదు. కానీ తప్పకుండా ఆయనతో సినిమా చేయడం మాత్రం ఖాయం. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. సినిమా చేయమని ఆయన్ని ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. నిజానికి మీకు ఓ ప్లాన్ ఉంది. అది ఎప్పుడు వర్కవుట్ అవుతుందో కానీ.. మా కాంబినేషన్‌లో మాత్రం సినిమా తప్పకుండా ఉంటుంది’ అన్నారు.
బాహుబలితో ప్రభాస్ రేంజ్‌ను టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కు పెంచిన దర్శకుడు జక్కన. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా అంటే ప్రభాస్ అభిమానులకు పండగే మరి. వీరిద్దరూ వారి వారి మూవీల కమిట్‌మెంట్స్‌తో బిజి బిజీగా ఉన్నారు. వారిద్దరి కాంబినేషన్‌లో నెక్ట్స్ మూవీ ఎప్పుడు ఉంటుందో వెయిట్ చెయ్యాలి.
ఇక బాలీవుడ్ ప్రేక్షకులు తనను యాక్షన్ హీరోగా చూడటానికి ఇష్టపడతారని అయితే ప్రేక్షకులు బోర్ కొట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో డిఫరెంట్ సినిమాలను చూస్ చేసుకుంటున్నాను . అందులో భాగంగానే ‘రాధే శ్యామ్’ మూవీ చేశాను అన్నారు డార్లింగ్. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపొందిన ‘రాధే శ్యామ్’లో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తున్నారు. ప్రేరణ అనే మ్యూజిక్ స్కూల్ టీచర్ పాత్రలో పూజా హెగ్డే చేసింది.