ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ ఎంఎం కీరవాణికి వరించింది. ఇక ఈ అవార్డుల వేడుకలో రాజమౌళి, రామ్ చరణ్, తారక్ స్పెషన్ ఎట్రాక్షన్ గా నిలిచారు. హాలీవుడ్ ప్రముఖుల మధ్యలో ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక తెలుగు సినిమా తరుపున నిలవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డుని ఆర్ఆర్ఆర్ సినిమాకి అందుకోవడంపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. అలాగే సంగీత దిగ్గజాలు అయిన ఏఆర్ రెహమాన్, ఇళయరాజా కూడా ఎంఎం కీరవాణికి అభినందనలు తెలియజేశారు.
అలాగే జక్కన్న, తారక్, రామ్ చరణ్ కి కూడా నాటు నాటు పాటకి అవార్డు అందుకోవడంపై అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ అవార్డుల వేడుకలో రాజమౌళి హాలీవుడ్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబందించిన అద్బుతమైన ఐడియా వచ్చిందని, దానిని ఇప్పటికే విజయేంద్రప్రసాద్, తన రైటింగ్ టీమ్ తో చర్చించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆ స్టొరీలైన్ మీద వారు ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ చేశారని అన్నారు.
ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని రాజమౌళి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ స్టొరీ స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయ్యాక ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేస్తామనేది పూర్తి వివరాలు తెలియజేస్తామని కూడా జక్కన్న చెప్పడం విశేషం. ఇక నాటునాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆస్కార్ అవార్డులకి మరింత చేరువ అయ్యిందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. అలాగే హాలీవుడ్ ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి కచ్చితంగా ఆస్కార్ వస్తుందని చెబుతున్నారు.