Rajamouli : క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలో ఫిల్మ్‌మేకర్ ఎస్ ఎస్ రాజమౌళి తన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులతో పాటు పరిశ్రమకు చెందిన వారిని ఆకట్టుకున్నారు. సినీ స్టార్స్ కంగనా రనౌత్ , అలియా భట్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, సమంతా రూత్ ప్రభు నుండి అనన్య పాండే వరకు అందరూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు.

రాజమౌళి అత్యంతప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిన నాటు నాటు పాట ఉత్తమ పాటగా క్రిటిక్ ఛాయిస్ అవార్డును అందుకోవడంతో పాటు ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డులను గెలుచుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి ప్రసంగం అభిమానులకు కన్నీళ్లు పెట్టించాయి.


ఎస్ఎస్ రాజమౌళి ప్రసంగాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ, బాలీవుడ్ నటి అలియా భట్, “ఈ క్షణానికి మాటలు అవసరం లేదు” అని క్యాప్షన్‌ను జోడించింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్ సరసన ఆలియా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ రాజమౌళి ప్రసంగానికి ప్రతిస్పందనగా వావ్ ఇది అద్భుతమైన క్షణం అని రాశాడు. అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రసంగాన్ని పంచుకుని అంతకు మించి అని క్యాప్షన్‌ను జోడించింది. సౌత్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు కూడా బిగ్ హార్ట్ ఎమోజీతో ఈ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రసంగాన్ని పంచుకుంటూ ఎమోజీలను కూడా షేర్ చేసింది.
ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌ను అందుకుంటున్నప్పుడు తన అంగీకార ప్రసంగంలో, రాజమౌళి తన విజయానికి తన జీవితంలోని మహిళలను గౌరవించారు. జై హింద్ తో తన ప్రసంగాన్ని ముగించారు. నా జీవితంలోని మహిళలందరికీ నా కృతజ్ఞతలు, నా తల్లి రాజనందిని, ఆమె నన్ను కామిక్స్, కథల పుస్తకాలు చదవమని , ఆమె నాలోని సృజనాత్మకతను ప్రోత్సహించింది..

నాకు తల్లిలా మారిన మా వదిన శ్రీవల్లి, తల్లిలా మారి నాలో బెస్ట్ వెర్షన్ ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. నా భార్య రమ, ఆమె నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ అయితే అంతకు మించి నా జీవితానికి డిజైనర్. ఆమె లేకపోతే ఈరోజు నేను లేను. నా కుమార్తెలకు, వారి ఒక్క చిరునవ్వు చాలు నా జీవితంలో వెలుగునిస్తుంది. మేరా భారత్ మహాన్. జై హింద్ అని తన ప్రసంగాన్ని ముగించారు రాజమౌళి.