సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం నరసింహ గురించి అంత వేగంగా ఎవరు మరిచిపోరు. ఆ సినిమా రజిని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అలాగే గ్లామర్ హీరోయిన్ పాత్రలకి కేరాఫ్ గా ఉన్న రమ్యకృష్ణ ఇమేజ్ ని కూడా అమాంతం మార్చేసిన చిత్రంగా ఈ మూవీ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో తన సూపర్ మాసివ్ పెర్ఫార్మెన్స్ తో రమ్యకృష్ణ రజినీకాంత్ ని కూడా డామినేట్ చేసేసింది అంటే ఆమె ఏ స్థాయిలో నటించిందో చెప్పొచ్చు. నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో రమ్యకృష్ణ పాత్రకి ప్రాణం పోసింది. నిజానికి రమ్యకృష్ణ కంటే సౌందర్య గొప్ప నటి అయినా కూడా ఈ సినిమాలో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.
నరసింహ సినిమా గురించి ప్రస్తావిస్తే అందరికి రమ్యకృష్ణ మొదటిగా గుర్తుకొస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సారి ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ 169వ చిత్రం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఈ మూవీలో రజినీకాంత్ కి జోడీగా ఐశ్వర్య రాయ్ కనిపించబోతుంది. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ కి ప్రతినాయికిగా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ కనిపించబోతూ ఉండటం ఇప్పుడు సినిమా మీద ఊహించని హైప్ క్రియేట్ చేసింది.
బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జోరు పెంచింది. అన్ని రకాల పాత్రలు చేస్తూ స్టార్ నటిగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి నరసింహ మూవీ తరహాలో రజినీకాంత్, రమ్యకృష్ణ స్క్రీన్ పై పోటీ పడటం ప్రేక్షకులకి నిజంగా ఆసక్తి కలిగించే వార్త అని చెప్పాలి. ఈ విషయాన్ని తాజాగా రమ్యకృష్ణ కూడా స్పష్టం చేసింది. మొత్తానికి రజిని, రమ్య కాంబో అంటే హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఉన్న కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదనే టాక్ వినిపిస్తుంది.