Rakul Preet Singh : రకుల్ ప్రీత్ తెల్లటి చీరను కట్టుకుని అభిమానులకు తన లుక్స్‌తో ఫీస్ట్ ను అందిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ఓటీటీలో విడుదలైన ఛత్రివాలి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం ఈ నటి ప్రింటెడ్ చీరలో కనిపించి కుర్రాళ్లను కవ్వించింది. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఈ చీరతో చేసిన పోస్ట్ షూట్ పిక్స్ ను షేర్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ అత్యద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ నటి సింపుల్ అవుట్‌ఫిట్స్ ధరించి స్టన్నింగ్ లుక్స్‌తో కనిపిస్తూ ఎప్పుడూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ అయినా ట్రెడిషనల్ వేర్ అయినా ఈ చిన్నది సింప్లిసిటీని ఇష్టపడుతుందని అని అనడానికి ఆమె ఇన్‌స్టాగ్రామ్ వార్డ్‌రోబ్ నిదర్శనంగా నిలుస్తుంది. కో ఆర్డ్ సెట్స్ నుంచి మిడీస్, గౌన్స్ తో పాటు లెహెంగా సెట్, ఆరు గజాల చీర వంటి ఎత్నిక్ వేర్స్‌ను ధరించి అద్భుతమైన ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంటలు రేపుతుంటుంది. తాజాగా ఈ చిన్నది లేటెస్ట్ ఫోటో షూట్ కోసం వైట్ కలర్ చీరను ఎన్నుకుంది. సంప్రదాయంగా చీరకట్టుకుని దిగిన పిక్స్‌ను ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి లుక్స్ ను చూసి ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

డిజైనర్ పాయల్ ఖండ్వాలా కు మ్యూజ్ గా వ్యవహరించింది రకుల్ ప్రీత్ సింగ్ తన ఫోటో షూట్ కోసం ఈ ఫ్యాషన్ లేబుల్ కలెక్షన్స్ నుండి రకుల్ ప్రీత్ తెల్లటి చీరను ఎంచుకుంది. ఈ చీరను సంప్రదాయంగా కట్టుకుని అందరిచూపును తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఆరేంజ్, బ్లాక్, పింక్, బ్రౌన్ షేడ్స్ లో వచ్చిన ప్రింట్స్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

రకుల్ ప్రీత్ ఈ ప్రింటెడ్ కాంటెంపరరీ చీరకు జోడీగా ఫుల్ స్లీవ్స్, టర్టిల్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ ను ఎన్నుకుంది. ఈ లుక్ లో రకుల్ ఎంతో అందంగా కనిపించింది.ఈ చీరకు మ్యాచింగ్ గా సిల్వర్ ఆక్సిడైజ్డ్ డ్యాంగ్లర్స్ ను చెవులకు అలంకరించుకుంది. చేతి వేళ్లకు మ్యాచింగ్ స్టేట్‌మెంట్ ఉంగరాలను పెట్టుకుంది. మినిమల్ ఆక్సెసరీస్‌తో తన లుక్ ను ఎంతో ఆకర్షణీయంగా మార్చుకుంది ఈ చిన్నది.

ట్రెడిషనల్ లుక్ కు తగ్గట్లుగా రకుల్ ప్రీత్ కనులకు మృదువైన స్మోకీ ఐ ష్యాడోను పెట్టుకుంది. కనులకు ఐ లైనర్ కనురెప్పలకు మస్కరా వేసుకుంది. కనుబొమ్మలను డార్క్ చేసుకుని తన పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని మినిమల్ మేకప్ తో మ్యాజిక్ చేసింది రకుల్.