Rakul Preet Singh : హాట్ ఫోటో షూట్‌లతో ఈ మధ్యన రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టా్గ్రామ్‌లో గరమ్ గరమ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తన మూవీ ఛత్రీవాలీ ని అద్భుతమైన అవుట్‌ఫిట్స్ తో ఫోటో షూట్ చేసి ప్రమోషన్ చేస్తోంది. రీసెంట్‌గా చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

రకుల తాను నటించిన త్వరలో విడుదల కాబోయే చిత్రం ఛత్రివాలీ ప్రచార కార్యక్రమాలల్లో నిమగ్నమైంది. ఈసారి, రకుల్ ప్రీత్ సమీర్ మదన్ ఫ్యాషన్ హౌజ్ నుంచి ఎన్నుకున్న బ్లూ బాడీకాన్ డ్రెస్‌లోను తన ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది. రకుల్ ప్రీత్ లావా-రుచ్డ్ కప్పుతో అమర్చిన బాడీకాన్ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది.ఈ అవుట్ ఫిట్‌లో గ్లామర్ డాల్ లా మెరిసిపోయింది రకుల్.

డ్రమాటిక్ స్లీవ్స్ కలిగిన స్టైలిష్ బ్లూ మిడి ధరించి దిగిన పిక్స్‌ను రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ కు బ్యూటీ వార్డ్‌రోబ్ బ్లూస్ అని క్యాప్షన్‌ను రాసింది. చివర్లో బ్లూ హార్ట్ ఎమోజీని జోడించింది. ఈ పిక్స్ చూసిన రకుల్ బాయ్‌ఫ్రెండ్, జాకీ భగ్నానీ, నెటిజన్లు ఆమె అద్భుతమైన రూపానికి ఫిదా అయి హార్ట్ ఏమోజీలను పోస్ట్ చేశారు.

డిజైన్ అంశాల విషయానికి వస్తే, ఫాక్స్ లెదర్ రచ్డ్ కప్‌తో జతచేయబడిన ఫిట్టెడ్ బాడీకాన్ జెర్సీ బాటమ్ ను రకుల్ వేసుకుంది. రింగ్ తో జతచేయబడిన ప్లగింగ్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్, డ్రమాటిక్ ఫుల్ స్లీవ్స్ స్పెషల్ లుక్‌ను అందించాయి. అవుట్‌ఫిట్ ముందు భాగంలో వచ్చిన కత్తిరించిన వివరాలు, ఫిగర్-హగ్గింగ్ డీటైల్స్, బ్యాక్ స్లిట్ రకుల్ లుక్ కు మరింత గ్లామర్ ను అందించింది. ఈ అవుట్‌ఫిట్ సమీర్ మదన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీనిని ది సిబిల్ బాడీకాన్ అని పిలుస్తారు. ఈ అవుట్‌ఫిట్ ధర రూ.28,500.

ఈ అవుట్‌ఫిట్ కు తగ్గట్లుగా నలుపు రంగు స్ట్రాపీ హై హీల్స్ ను పాదాలకు వేసుకుంది ఈ బ్యూటీ. చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ రింగ్‌లు ,చెవులకు వెండి డ్యాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.

రకుల్ గ్లాస్ పిక్స్ కోసం నిగనిగలాడే న్యూడ్ పింక్ లిప్ స్టిక్ తో పెదాలను దిద్దుకుంది. కనులకు వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు సూక్ష్మమైన ఐ షాడో, కనురెప్పలపై మస్కరా పెట్టుకుని , తన కురులతో మధ్యపాపిట తీసి లూజ్ గా వదులుకుని ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.