Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతమైన ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో దివా వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ ఫ్యాన్స్ కు పిచ్చెకిస్తోంది. క్యాజువల్ లుక్స్‌లో ఎలా మెప్పించాలో, ఎత్నిక్ లో అందాలు ఎలా ఒలకబోయాలోరకుల్ ప్రీత్ కు బాగా తెలుసు. తాజాగా ఈ బ్యూటీ వజ్రంలా ప్రకాశవంతంగా కనిపించే చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తోంది.
రకుల్ ప్రీత్ ఫ్యాషన్ డిజైనర్ సీమా గుజ్రాల్‌కు మ్యూజ్ గా వ్యవహరిస్తోంది. ఈ డిజైనర్ షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన ఎత్నిక్ సమిష్టిని తన లేటెస్ట్ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం ఎంచుకుంది రకుల్. భారీ అలంకరణలతో వచ్చిన ఈ సిల్వర్ లెహంగాలో రకుల్ ప్రీత్ సింగ్ అదరగొట్టేసింది. వెండి స్లిప్ బ్లౌజ్‌లో సిల్వర్ సీక్విన్స్ , కార్సెట్ వివరాలు, అలంకరణలతో వచ్చిన స్లీవ్ లెస్ సిల్వర్ స్లిప్ బ్లౌజ్‌ను వేసుకుంది. బ్లౌజ్‌కు వచ్చిన డీప్ నెక్‌లైన్ రకులు ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ బ్లౌజ్‌కు సరిపోయేలా సిల్వర్ లాంగ్ ,ఫ్లూ స్కర్ట్‌ను ధరించింది. వెండి జారీ బార్డర్‌లను కలిగి ఉన్న వెండి జార్జెట్ దుపట్టాను వీటికి జోడించింది.
ఈ మెరిసేటి అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా డైమండ్ జ్యువెల్లరీని ఎంచుకుంది రకుల్ ప్రీత్. అన్మోల్ జ్యువెలర్స్ నుండి స్టేట్‌మెంట్ డైమండ్ నెక్ చోకర్ ను తన మెడలో అలంకరించుకుంది. చెవులకు వజ్రంతో రూపొందించి స్టడ్స్, చేతికి వజ్రాల గాజులు వేసుకుని ప్రకాశవంతంగా మెరిసిపోతూ రకుల్ ప్రీత్ కెమెరాకు హాటు పోజులను ఇచ్చింది
ఫ్యాషన్ స్టైలిస్ట్ అన్షికా వర్మ రకులు ప్రీత్ సింగ్ లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చింద్. రకుల్ ప్రీత్ చిత్రాలకు పోజులిచ్చేటప్పుడు తన కురులతో మధ్య పాపిట తీసి లూజుగా వదులుకుంది. ఇక మేకప్ ఆర్టిస్ట్ సలీం సయ్యద్ సహాయంతో రకుల్ తన అందాలకు మెరుగులు దిద్దుకుంది. రకుల్ ప్రీత్ తన పెదాలకు లిప్ స్టిక్, కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా వేసుకుని కనుబొమ్మలను హైలెట్ చేసి గ్లామరస్ లుక్స్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది.