Ram Charan : క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ 9 ఏళ్ల బాలుడి కోరికను నెరవేర్చి పెద్ద మనసు చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన బిజీ షెడ్యూల్ ను సైతం పక్కన పెట్టి రామ్ చరణ్ ఆ చిన్నారి మోములో చిరునవ్వులు పూయించాడు. 9 ఏళ్ల బాలుడు రావుల మణి కుశాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని స్పర్ష్ హాస్పిటల్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తన అభిమాన తార రామ్ చరణ్‌ను కలవాలన్న ఈ బాలుడి కోరికను తెలుసుకున్న మేక్ ఏ విష్ సంస్థ రామ్‌చరణ్‌కు ఈ విషయాన్ని తెలియజేసింది.

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయినా వీలు చూసుకుని తన యువ అభిమానిని కలవడానికి హాస్పిటల్ కు వచ్చాడు రామ్ చరణ్. కుశాల్ తో సరదాగా మాట్లాడి ఓ బహుమతితో అతడిని ఆర్ బాలుడిని కలిసిన రామ్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

చెర్రీ పెద్ద మనుసు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రామ్ ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. కొందరు రామ్ అభిమానులుగా గర్వపడుతున్నారని కూడా రాశారు. కాగా, రామ్ చరణ్ తన కెరీర్‌లో తొలిసారిగా శంకర్‌తో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్‌సి 15గా పిలువబడే ఈ ప్రాజెక్ట్ తెలుగు చలనచిత్రంలోకి శంకర్ ప్రవేశాన్ని కూడా సూచిస్తుంది. రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబు సనాతో స్పోర్ట్స్ బేస్డ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు. ఈ మూవీ పనులు కూడా అండర్ గ్రౌండ్‌లో నడుస్తున్నాయి. వ్యక్తిగత విషయాలకు వస్తే రామ్ చరణ్ , అతని భార్య ఉపాసన కొణిదెలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.
