టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి మెగాస్టార్ ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. అయితే సొసైటీలో ఎవరికి వారే ఇష్టానుసారంగా మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద అడ్డమైన విమర్శలు చేసి హైలైట్ అయిపోదాం అనుకుంటారు. కొంతమంది అలా చేసి ఫేమ్ కూడా సంపాదించుకున్నారు. మీడియాలో కూడా ఒక వర్గం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. ఏ చిన్న అవకాశం దొరికిన డిబేట్ ల మీద డిబేట్ లు పెట్టి మెగా ఫ్యామిలీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎవరిని కూడా విమర్శించరు. వాళ్ళ మీద రాయి వేసి మళ్ళీ మన ఒంటికి బురద అంటించుకోవడం ఎందుకని వదిలేస్తూ ఉంటారు.
ఇక పవన్ కళ్యాణ్ ని కూడా లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ స్టేజ్ మీద ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి. చిరంజీవి పక్కన ఉండగానే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరికి తాకాలో వారికే తాకాయని చెప్పాలి. ఈ మధ్య చాలా మంది ఇష్టానుసారంగా ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మెగాస్టార్ క్వైట్ గా ఉంటారు.
అది ఆయన నైజం. కాని పదే పదే అలాగే మాట్లాడుతూ ఉంటే ఆయన క్వైట్ గా ఉన్నా కూడా ఆయన వెనుక కుటుంబంగా మేము అందరం ఉన్నాం, ఫ్యాన్స్ ఉన్నారు మేము మాత్రం క్వైట్ గా ఉండే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని అందరికి చాలా క్వైట్ గానే చెబుతున్నా అర్ధం చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య రోజా మెగా ఫ్యామిలీని, చిరంజీవిని ఉద్దేశించి కాస్తా అతిగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ నేపధ్యంలోనే రామ్ చరణ్ ఈ కామెంట్స్ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తుంది.