The Warrior : ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ఎన్.లింగు స్వామి డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా నేడు(జులై 14) తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. రామ్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మరి ఆడియన్స్ రామ్ పాత్రపై ఎలా స్పందిస్తున్నారు? అసలు మూవీ ఎలా ఉందని భావిస్తున్నారు? ఆడియన్స్ ఇచ్చిన ట్విటర్ రివ్యూ ఏంటి? వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.
The Warrior : రామ్ యాక్టింగ్ అదుర్స్..
ట్విటర్ రివ్యూ ప్రకారం.. రామ్ సినిమాలన్నీ ఫన్‌కి పెద్దపీట వేస్తాయి కాబట్టి సర్వసాధారణంగా ఫస్టాఫ్ కాస్త ఫన్నీగా.. సెకాండాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్‌తో సినిమా రూపొందిందని ఆడియన్స్ టాక్. డైరెక్టర్ లింగుస్వామికి ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అవుతుందని చెబుతున్నారు. యాక్షన్ ఎపిపోడ్స్‌లో రామ్ యాక్టింగ్ అదరగొట్టేశాడని చెబుతున్నారు. ఇక సినిమాకి వస్తోన్న ముందస్తు టాక్ ప్రకారం, సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ట్విట్టర్‌లో వస్తోన్న టాక్ ప్రకారం.. సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనడంలో సందేహం లేదని చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు.. రామ్ యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నీ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పిస్తాయట. సినిమాలో చాలా వరకు బరువైన యాక్షన్, డ్రామా ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని టాక్.
ముఖ్యంగా రామ్, ఆది పినిశెట్టిల మధ్య వచ్చే ఫైట్ సీన్లు, హొరాహొరీగా పోరాడే సన్నివేశాలు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయని టాక్. పాటలు, రామ్, కృతిల డాన్సులు సినిమాకు హైలైట్‌గా నిలిచాయట. మొత్తానికి మొదటి భాగం సూపర్ హిట్… ఇక సెకండాఫ్ మాత్రం ఊరమాస్‌గా సాగుతుందని, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపాయట. ఇంటర్వెల్ బ్యాంగ్ వావ్ అనిపించక మానదట. ఇక యూత్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తున్న బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్ సెకండాఫ్‌లో వస్తాయట. మొత్తానికి సినిమా సక్సెస్ అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.