మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు అందిస్తున్న జబర్దస్త్ కామెడీ రియాల్టీ షో ఎంత పాపులర్ అయిన అందరికీ తెలిసిందే. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒకప్పుడు అవకాశాల కోసం స్టూడియోలు చుట్టూ తిరిగిన చాలామంది టాలెంటెడ్ నటులకు జబర్దస్త్ మంచి వేదికగా నిలిచింది. మంచి అవకాశాలు అందించి నటులుగా వాళ్లకి మంచి గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఆర్థికంగా కూడా జబర్దస్త్ వారికి ఒక భరోసా ఇచ్చింది. తెలుగు టీవీ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్స్ తో ఇప్పటికీ కూడా జబర్దస్త్ తన హవాని కొనసాగిస్తుంది.
అయితే గత కొంతకాలంగా నటులు ఒక్కొక్కరుగా జబర్దస్త్ వెళ్ళిపోతున్నారు. మిగిలిన చానల్స్ లో మంచి అవకాశాలు వస్తూ ఉండడంతో వారు జబర్దస్త్ వదిలేస్తున్నారు. జబర్దస్త్ కి మంచి రేటింగ్స్ తీసుకురావడంలో ఉపయోగపడిన హైపర్ ఆది సుడిగాలి సుదీర్ లాంటివారు ప్రస్తుతం సోకి దూరంగా ఉన్నారు. అలాగే జబర్దస్త్ కి కళ తీసుకొచ్చిన జడ్జ్ లు నాగబాబు, రోజా కూడా ఆ షో నుంచి పూర్తిగా బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ షో తో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అనసూయ కూడా ఈ షోని వీడింది. ఆమె స్థానంలో జబర్దస్త్ కి కొత్త యాంకర్ రాబోతుందని అందరూ భావించారు.
అలాగే సీనియర్ యాంకర్ మంజుషాని ఈ షో కోసం తీసుకొస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా ఉన్న రష్మి గౌతమ్ ను జబర్దస్త్ కోసం మళ్లీ మల్లెమాల టీం ఖరారు చేసింది. గత వారం ఎపిసోడ్ ప్రోమోలో కొత్త యాంకర్ ను తీసుకురాబోతున్నట్లు కలరింగ్ ఇచ్చిన మరల తాజాగా ఎపిసోడ్ తో రష్మిని ఖరారు చేశారు. కొత్త యాంకర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన కంటెస్టెంట్లకు రష్మి గౌతమ్ ఎంట్రీ తో నిరాశ కలిగినట్లు ఎపిసోడ్లో చూపించి ట్విస్ట్ ఇచ్చారు. రష్మీ గౌతమ్ కూడా ట్విట్టర్లో తన ను ఇంకా భరించాల్సిందే అంటూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.