Rashmika Dating : రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తోంది. రష్మిక మందన ఇటీవల విడుదలైన సీతారామం సినిమాలో అఫ్రీన్ అనే కీలక పాత్ర పోషించింది. తన కెరీర్లో వచ్చిన మంచి గుర్తుండిపోయే అవకాశాల్లో, పాత్రల్లో ఇదొకటి అని రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా, నేషనల్ క్రష్‌గా రష్మిక సినీఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. రష్మిక కెరీర్ ఆరంభం నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అలా టాలీవుడ్లోకి అడుగు పెట్టిందో లేదో కానీ తన ప్రియుడితో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అతనితో కంప్లీట్‌గా రిలేషన్‌ను కట్ చేసుకుంది రష్మిక. గత కొంత కాలంగా అమ్మడిపై ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ- రష్మికలు చాలాకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఫిల్మీ దునియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విజయ్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వీరి రిలేషన్‌పై గాసిప్స్‌కు మాత్రం కొదువ లేకుండా పోయింది. ఇక తను నోరు విప్పకుంటే ఈ రూమర్స్‌కి హద్దూ అదుపు ఉండదని భావించిందో ఏమో కానీ తాజాగా రష్మిక మందన తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది.
Rashmika Dating : నేను చెప్పేంత వరకూ ప్రేమ, పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి రావొద్దు
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఐదు సినిమాలు చేస్తున్నానని. వాటి గురించి అడిగితే ఎంతసేపైనా మాట్లాడతానని తెలిపింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలన్ని ఆసక్తి ఉండటం సహజమేనని కానీ పదేపదే అవే ప్రశ్నలు అడగటం ఇబ్బందిగా అనిపిస్తోందని తెలిపింది. ప్రేమ, పెళ్లి విషయాల్లో పుకార్లను అస్సలు నమ్మ వద్దని సూచించింది. తాను చెప్పేంత వరకూ తన ప్రేమ, పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావద్దని సూచించింది. తన గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని రష్మిక మందన స్పష్టం చేసింది. మొత్తానికి ఎలాగైతేనేమీ.. తనకూ, విజయ్ దేవరకొండకు మధ్య ఎలాంటి రిలేషన్ ఏమీ లేదని.. అతనితో డేటింగ్లో లేనని రష్మిక చెప్పకనే చెప్పింది. ఇక రష్మికకు బయోపిక్స్, స్పోర్ట్స్ సంబంధిత సినిమాల్లో నటించాలని ఉందట. అలాంటి అవకాశం వస్తే వదులుకోనని చెప్పింది.