మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీకులు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. లీగల్ సెల్ యాక్షన్ తీసుకుంటుందని మేకర్స్ లీకు రాయుళ్లకు వార్నింగ్ లు ఇస్తున్నా కూడా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఎవరికి తోచింది వారు లీక్ చేస్తూ మేకర్లకు తలనొప్పిగా మారారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు చాలా వరకు బిగ్ స్టార్ లకు సంబంధించిన సినిమాల షూటింగ్ లు అవుట్ డోర్ లలోనే అత్యధికంగా జరుగుతున్నాయి. ఇదే లీకు రాయుళ్లకు అదనుగా మారుతుంది.
దీంతో ప్రతి స్టార్ హీరోకు సంబంధించిన ప్రతీ సినిమా ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అవుతున్నాయి. అత్యంత బారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` సినిమా కూడా లీకుల బెడదతో బెంబేలెత్తిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు అత్యంత కీలకంగా నిలిచే ఎన్టీఆర్ – పులి ఫైట్ ఫొటోలు లీక్ కావడంతో ముందే ఆ సీన్ రివీల్ కావాల్సి వచ్చింది.
ఇక పాన్ ఇండియా మేవీగా విడుదలై వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన `పుష్ప` కూడా లీకులను ఎదుర్కొంది. నిన్నటి బాలకృష్ణ – గోపీచంద్ ల సినిమా కూడా లీకులని ఎదుర్కొంటోంది. తాజాగా ఇదే చిత్రాల తరహాలో శంకర్ – రామ్ చరణ్ ల `RC15` ని కూడా లీకులు వణికిచేస్తున్నాయి. ఇటీవల తమ చిత్రానికి సంబంధించిన చరణ్ లుక్ బయటికి లీక్ కావడంతో ఆగ్రహించిన శంకర్ – దిల్ రాజు టీమ్ లీకు రాయుళ్లని హెచ్చిరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ని కూడా విడుదల చేశారు.
లీకు రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ #RC15 #SVC50 చిత్రీకరణ సినిమా అవసరాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో జనసందోహంతో జరుగుతోంది. ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని చట్టవిరుద్ధంగా తీసిన షూటింగ్ చిత్రాలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకుండా వుండాలని మేము అబ్యర్థిస్తున్నాము.. అంటూ ఆ లెటర్ లో పేర్కొన్నారు.
అనధికారిక కంటెంట్ ను పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ పైరసీ టీమ్లు చర్యలు తీసుకుంటాయి` అని స్పష్టం చేశారు. ఎంత వార్నింగ్ ఇచ్చినా శంకర్ – చరణ్ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అవుతుండటంతో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి ఎలా అడ్డుకట్ట వేస్తారన్నది వేచి చూడాల్సిందే మరి.
పొలిటికల్ సెటైరికల్ గా రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఇటీవలే రాజమండ్రిలో మొదలైంది. అక్కడ పలు కీలక సన్నివేశాలని చరణ్ పై శంకర్ షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరికొత్త పాత్రల్లో కనిపించబోతున్నారు. తండ్రీ కొడుకులుగా ఆయన కనిపిస్తారని ఓ పాత్ర 1930 నేపథ్యంలో సాగుతుందని తండ్రి పాత్ర ఓ పొలిటికల్ కార్యకర్తగా కనిపించనుండగా మరో పాత్ర ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నారని సమాచారం. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా స్టార్ డైరెక్టర్ ఎస్. జె. సూర్య నటిస్తున్నారు.