మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కాంబినేషన్ లో దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసందే. రామ్ చరణ్, తారక్ పెర్ఫార్మెన్స్ కి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అంతే కాకుండా అద్భుతమైన రెస్పాన్స్ తో బాలీవుడ్ జనాలు కూడా సినిమాకి బ్రహ్మరధం పట్టారు. ఇక బాహుబలి రేంజ్ లో కాకపోయినా వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ ని దేశ వ్యాప్తంగా ఈ సినిమా సొంతం చేసుకుంది. రామ్ చరణ్, తారక్ కి పాన్ ఇండియా ఇమేజ్ ని ఈ సినిమా తీసుకొచ్చింది.
ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా తర్వాత అంతర్జాతీయంగా కూడా ప్రశంసలని సొంతం చేసుకుంటుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. డాక్టర్ స్ట్రేంజ్ రచయిత కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కథ, మేకింగ్ పై ప్రసంశలు కురిపించారు. ఓ విధంగా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ లో మొదటి సారి ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయిలో ప్రశంసలు దక్కాయని చెప్పాలి. ఈ సినిమాని విజువల్ వండర్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. ఇంత గొప్ప ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో సారి ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది.
అయితే అది జపాన్ లో కావడం విశేషం. జపాన్ లో ఇతర దేశాలకి చెందిన సినిమాలు అంత వేగంగా రిలీజ్ కావు. అక్కడ అనేక నిబంధనలని దాటుకొని సినిమా అక్కడి ప్రేక్షకుల ముందుకి వస్తుంది. బాహుబలి సినిమాకి ఇప్పటికే జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమాతో ప్రభాస్ కి జపాన్ ఆడియన్స్ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇప్పుడు రాజమౌళి నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా జపాన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. అక్టోబర్ 21న జపాన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరో అక్కడి ప్రేక్షకులని ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనేది చూడాలి.