Rubina Dilaik : ప్రముఖ నటి రుబీనా దిలైక్ , ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ప్రముఖమైన పేర్లలో ఒకరు. ఈ బ్యూటీ కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. నటి తన నటనా నైపుణ్యం, అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్ కారణంగా ఎప్పుడు హెడ్ లైన్స్ లో నిలుస్తుంటుంది. ఈ బ్యూటీ ఆకర్షణీయమైన అవుట్ ఫిట్స్ తో చేసే ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో మంటలు రేపుతుంటాయి.

తాజాగా రుబీనా దిలైక్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో అద్భుతమైన చీరలో దిగిన అనేక ఫోటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఈ ఫోటోలలో నటి, స్టైలిష్ పింక్ ప్లంగింగ్ నెక్లైన్, ఫుల్ స్లీవ్స్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో వచ్చిన బ్లౌజ్‌ని ధరించి, దానికి జోడీగా అందమైన ఎంబ్రాయిడరీ చీరను కట్టుకుంది. ఈ లుక్స్ లో బ్యూటీ ని చూసి ఆమె అభిమానులు తన అందాన్ని మెచ్చుకుంటూ అద్భుతమైన కామెంట్స్ రాశారు.

ఫ్యాషన్ లేబుల్ సమ్యక్ క్లోతింగ్ నుంచి ఈ అద్భుతమైన చీరను తన ఫోటో షూట్ కోసం సెలెక్ట్ చేసుకుంది రుబీనా. ఈ చీరకు తగ్గట్లుగా ఆమె హై-డెఫినిషన్ మేకప్‌ని ఎంచుకుంది. ఆమె తన ఉంగరాల కురులను లూస్ గా వదులుకుని కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది.

కనులకు వింగేడ్ ఐ లైనర్, మస్కారా, బ్లాక్ ఐ ష్యాడో పెట్టుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని అదరగొట్టింది చిన్నది. తన గ్లామర్ తో ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.ఈ బాలీవుడ్ బ్యూటీ టెలివిజన్ నటి అయినప్పటికీ సోషల్ మీడియా లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాల్ లో పిక్స్ పోస్ట్ చేసిన ప్రతిసారి లైకులు, షేర్ ల వర్షం కురుస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలు చూసి ఫ్యన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
