టాలీవుడ్ అందాల భామ రుహని శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసర లేదు. చి.ల.సౌ సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
అయితే తెలుగు సినిమాలో ఇప్పటి వారు రుహని శర్మ గ్లామర్ పాత్రలలో నటించలేదు. ఇప్పటి వరకు ఆమె తెలుగులో నాలుగు సినిమాలలో నటించింది. చిలసౌ తో పాటు విశ్వక్ సేన్ కి జోడీగా హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలలో ఈమె నటించింది
ఈమె నటించిన నాలుగు సినిమాలలో రెండు మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని నటిగా కూడా ఆమెకి గుర్తింపు తీసుకొచ్చాయి. మిగిలిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు
అయితే ఈ అమ్మడు తరుచుగా ఫోటో షూట్ లు చేస్తూ హాట్ అందాలు ఆరబోస్తున్న అనుకున్న స్థాయిలో అవకాశాలని మాత్రం అందుకోలేకపోతుంది. స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఎదిగే అవకాశం మాత్రం ఈ భామకి దొరకడం లేదు.
ప్రస్తుతం తెలుగులో మీట్ క్యూట్ అనే సినిమాతో పాటు హిందీలో ఒక సినిమా చేస్తుంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలు అయినా రుహని శర్మ లక్ మారుస్తాయేమో చూడాలి.