సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. హీరోలతో సమానమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అతి కొద్ది కాలంలోనే సాయి పల్లవి సొంతం చేసుకుంది. తన నటన డ్యాన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. స్టార్ హీరోలకు జోడిగా అవకాశం ఇచ్చిన కూడా పాత్ర నచ్చితేనే చేయడానికి ముందుకు వస్తుంది. ఈ కారణంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా సరిలేరు నీకెవరు సినిమాలో అవకాశాన్ని వదులుకుంది. అలాగే విజయ్ దేవరకొండ జోడిగా డియర్ కామ్రేడ్ సినిమాలో అవకాశం వచ్చినా కూడా అందులో ముద్దు సన్నివేశాలు చేయడానికి ఇష్టం లేక సినిమాని తిరస్కరించింది.
కథ నచ్చితే కొత్త దర్శకులతో కూడా చేయడానికి సాయి పల్లవి రెడీగా ఉంటుంది. రెమ్యూనరేషన్ కంటే సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది నిర్ణయించుకుని ఆమె కథల ఎంపిక చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే చేసినవి తక్కువ సినిమాలోని అందరికీ గుర్తుండి పోయే పాత్రలను చేస్తూ సాయి పల్లవి తనదైన ముద్ర క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి విజయ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా విజయ్ దేవరకొండతో కలిసి నటించేది లేదని తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు టాక్.
రౌడీ స్టార్ విజయ్ సినిమాల ఎంపిక వేరే విధంగా ఉంటుందని, అతను సినిమా అంటే కచ్చితంగా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని, ఈ కారణంగానే అతనితో సినిమాలు చేయడం భవిష్యత్తులో కూడా కష్టమే అవుతుంది అని చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ లు సైతం విజయ్ దేవరకొండకు జోడిగా నటించడానికి ఓవైపు ఆసక్తి చూపిస్తూ ఉంటే సాయి పల్లవి మాత్రం అతనితో నటించేది లేదని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడగలమా లేదా అనేది వేచి చూడాలి.