సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అలాగే ప్రస్తుతం తరం హీరోయిన్లలో ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ గా సాయి పల్లవి ఉంది. ఆమె తెలుగులో చివరిగా విరాటపర్వం సినిమాలో రానాకి జోడిగా నటించింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు కరెక్ట్ కాలేదు. తమిళంలో గార్గి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సాయి పల్లవి తర్వాత ఏ సినిమా కూడా ఇప్పటివరకు అంగీకరించలేదు. చాలామంది దర్శక నిర్మాతలు ఆమెను అప్రోచ్ అవుతున్న కూడా కథ విన్న తర్వాత తన పాత్ర నచ్చితేనే అంగీకరిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆమె సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లో సాయి పల్లవి ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. అజిత్ హీరోగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమాలో సాయి పల్లవి ఓ కీలక పాత్ర కోసం ఫైనల్ అయినట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తన 50వ చిత్రంలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా ఖరారు అయినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ధనుష్ దర్శకత్వంలోని ఈ సినిమా తెరకెకబోతు ఉండడం విశేషం. పిరియాడిక్ జోనల్లో తెరకెక్కబోయే ఈ సినిమా శేఖర్ కమ్ముల సినిమా తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ధనుష్ నటించిన సార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరోవైపు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ తెలుగు భాషల్లో ఒక మూవీ తెరకెక్కబోతుంది. దాని తర్వాత తన దర్శకత్వంలో 50వ సినిమా హీరోగా చేయబోతున్నాడు.