AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఎవరికి వారే ప్రజాక్షేత్రంలో తమ రాజకీయా వ్యూహాలతో ముందుకి వెళ్తున్నారు. ప్రజలని నమ్మించి వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలని సొంతం చేసుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ బూత్ లెవల్ లో గ్రామ సారథులని నియమించుకొని ముందుకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే నారా లోకేష్, చంద్రబాబు యాత్రలకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనుమతులు లేవంటూ పర్మిషన్ ఇవ్వడం లేదు.
వారి యాత్రలకి వీలైనంత వరకు పోలీసు బలగాలని ఉపయోగించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిని అవకాశంగా మార్చుకొని ప్రభుత్వం తమపై ఆంక్షలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేస్తుందని టీడీపీ సింపతీ సంపాదించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలా పోలీసులతో ఆంక్షలు విధించి ప్రతిపక్షాల యాత్రలని అడ్డుకోవడం ద్వారా కచ్చితంగా టీడీపీకి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పర్యటనలకి కూడా ఇదేరీతిలో ఆటంకాలు కలిగించారు. అయితే ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం వెనుక ముఖ్యమంత్రి కంటే షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ సజ్జలని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా సజ్జల రామకృష్ణా రెడ్డివైపే వెళ్ళు చూపిస్తున్నారు. తమని అడ్డుకునే కార్యక్రమం అంతా సజ్జల డైరెక్షన్ లోనే జరుగుతుంది అంటూ విమర్శలు చేశారు. ఇక వైసీపీ నుంచి బయటకి వచ్చిన కోటంరెడ్డి కూడా షాడో సీఎం తమపై కేసులు పెట్టించి, పోలీసులని ఉపయోగించుకొని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇలా అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డివైపే వేళ్ళు చూపిస్తూ ఉండటంతో ఇప్పుడు వైసీపీ వర్గాలలో కూడా కొత్త అనుమానాలు వస్తున్నాయి. జగన్ ని ఓడించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు చేస్తున్నాడేమో అనే డౌట్ తో చూస్తున్నారు. ప్రతిపక్షాలపై ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఆంక్షలు పెట్టడం ద్వారా ప్రజల సింపతీ వారికి వెళ్ళిపోయి జగన్ దారుణంగా ఓటమికి సజ్జల కారణం అవుతున్నారని చర్చించుకుంటున్నారు.