యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన హవాని కొనసాగిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహూ, రాధేశ్యామ్ సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఏవరేజ్ టాక్ తోనే సుమారు 400 కోట్లకిపైగా ఈ సినిమాలు కలెక్షన్ సొంతం చేసుకున్నాయి అంటే ప్రభాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో అర్ధ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ తో ఆది పురుష్ సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇది కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సలార్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. శృతి హాసన్ ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది.
భారీ బడ్జెట్ తో తెరెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆగష్టు 15 సందర్భంగా ఈ మూవీకి సంబందించిన కీలక అప్డేట్ ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించింది. సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. ఈ డేట్ చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్తా నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఏడాదిలోనే ప్రభాస్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా సలార్ కోసం ఏడాది వరకు ఎదురుచడక తప్పని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా చూడాలంటే మరో ఏడాది ఎదురుచూడాలని ఊహించుకోవడం కూడా ఫ్యాన్స్ ని నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఇక ప్రాజెక్ట్ కె అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ఈ సినిమా రిలీజ్ కావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది.