Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత.. ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా. అమ్మడు హిందీలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది. హిందీ సినిమాలో అయితే నటించలేదు కానీ ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ద్వారా ఈ బ్యూటీ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఓరామాక్స్ అనే సంస్థ… ఓరామాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ పేరిట మన దేశంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ ఎవరనే విషయమై ఓ సర్వే నిర్వహించింది. ఆశ్చర్యకరంగా ఈ సర్వేలో సామ్ టాప్‌లో నిలిచింది. ఆలియా భట్, నయనతార తర్వాతి స్థానాలకు సరిపెట్టుకోవల్సి వచ్చింది.
Samantha : సామ్ రిప్లైతో నోరెళ్లబెట్టిన అక్షయ్..
అటు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ఇటు ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌తో హిందీ మాస్ ప్రేక్షకుల హృదయాలను మన ముద్దుగుమ్మ కొల్లగొట్టేసింది. ఇక దీంతో అమ్మడు తన మకాంను దాదాపుగా ముంబైకి మార్చేసింది. ఇక తాజాగా అమ్మడు ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ షోలో ఆమె అక్కడి స్టార్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి వచ్చిన ఈ భామ ‘ఊ అంటావా మావా..’ సాంగ్‌కి స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. ఈ సందర్భంగా చాలా వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో మీరు డాన్స్ చేయాల్సి వస్తే ఏ ఇద్దరు హీరోలతో చేస్తారు అడిగితే.. గుక్క తిప్పుకోకుండా సమంత.. రణవీర్ సింగ్, రణవీర్ సింగ్ అని చెప్పేసింది. అమ్మడి ఆన్సర్‌తో పక్కనున్న స్టార్ హీరో అక్షయ్ సైతం నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.
నెపోటిజంపై సైతం సామ్ స్పందించింది. గాఢ్ ఫాదర్ ఉంటే మొదటి సినిమా వరకేనని.. ఆ తరువాతైనా తమని తాము నిరూపించుకోవాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఇన తన పర్సనల్ విషయానికి వస్తే.. నాగచైతన్యతో ఎలాంటి స్నేహ సంబంధమూ లేదని..తామిద్దరినీ ఒకే గదిలో ఉంచితే కత్తులు వంటివన్నీ దాచేయాలని చెప్పుకొచ్చింది. తాను చైతూ నుంచి రూ.250 కోట్ల భరణం తీసుకున్నానని జరిగిన ప్రచారం తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చింది. తన విడాకులేమంత సామరసయంగా జరగలేదని చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్నప్పుడు మొదట్లో బాధపడ్డానని.. జీవితం చాలా ఇబ్బందికరంగా మారిందని తరువాత స్ట్రాంగ్ అయ్యానని సామ్ చెప్పుకొచ్చింది. ఇక కరణ్..నువ్వు, నేను సింగిల్.. ఇద్దరం కలిసి వెకేషన్‌కు వెళ్దామా.. అంటూ ప్రపోజ్ చేయగా.. నో చెబుతూనే ముద్దుగా ఎస్ కూడా చెప్పేసింది. ఈ షోలో కొన్ని సందర్బాల్లో సమంత ఎఫ్ వర్డ్ కూడా వాడేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంగా కాఫీ విత్ కరణ్ షోలో అమ్మడు బాగా హైలైట్ అయిపోయింది.