Chai and Sam : అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్ళి చేసుకొని.. కొంతకాలం అన్యోన్యంగా కాపురం చేసుకున్న తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్ అని.. అభిమానులు మురిసిపోయేవారు. వారి ఆనందాన్ని ఈ జంట ఎంతోకాలం నిలవనివ్వలేదు. తొలుత విడాకుల ప్రచారం జరుగుతుంటే.. దీనిని అభిమానులు మాత్రం పుకార్లంటూ కొట్టిపారేశారు. కొద్ది రోజులకే అవి పుకార్లు కాదని.. అక్షర సత్యమని నిరూపిస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఇక బ్రేకప్ తర్వాత ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. ఇద్దరూ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయినా కూడా సామ్, చైతూలకు సంబంధించి ఏదైనా న్యూస్ వస్తే మాత్రం తెగ వైరల్ అవుతూనే ఉంది.
Chai and Sam : సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వీడియో..
అయితే మరోసారి వీరిద్దరి గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పెళ్ళి అయిన తర్వాత సామ్ పేరు మీద చైతూ ఒక ఫ్లాట్ తీసుకున్నాడని, అందులోనే వారిద్దరూ జీవించడానికి నిర్ణయించుకున్నారని సీనియర్ నటులు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తరువాత దీనిని వారు అమ్మేశారని.. అయితే అమ్మిన వ్యక్తి నుంచే సమంత అధిక మొత్తంలో డబ్బు చెల్లించి మరీ వెనక్కి తీసేసుకుందని సీనియర్ నటులు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సామ్ ఆ ఇంట్లో తన తల్లితో కలిసి జీవిస్తున్నట్టు మురళీ మోహన్ వెల్లడించారు.
‘నా కాంప్లెక్స్‌లో ఇద్దరూ(చైతూ, సామ్) కలిపి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. అందులోకి ప్రవేశించి కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. అయితే ఆ తర్వాత దాన్ని రెనోవేట్ చేయించాలనుకున్నారు. ఆ పని పూర్తవుతుండగానే.. వేరే పార్టీకి దాన్ని అమ్మేశారు. రెనోవేషన్ పూర్తయిన తర్వాతే ఫ్లాట్ అప్పగిస్తామని వారికి చెప్పారు. అదే సమయంలో నాగచైతన్య, సమంతల మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. అవి వారు విడిపోవడానికి కారణమయ్యాయి. విడాకుల తర్వాత సామ్ మరో బిల్డింగ్‌ను కొనాలనుకుంది. అయితే తన భర్తతో జీవించిన ఫ్లాట్ కన్నా మంచిది వేరే కనిపించలేదు ఆమెకు. అందుకే తమ బిల్డింగ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తినే తిరిగి తనకి ఆ ఫ్లాట్ అమ్మమని కోరింది. అయితే అతడు ముందు ఒప్పుకోకపోయినా.. తన దగ్గర కొన్నదానికన్నా ఎక్కువ ధరనే చెల్లిస్తానని చెప్పడంతో ఆమెకు తిరిగి అమ్మడానికి అంగీకరించాడు’ అని మురళీ మోహన్ చెప్పారు. అయితే ఇప్పటి వరకూ సామ్‌కు ఫ్లాట్ ఇచ్చేసి చైతూ వెళ్లిపోయాడని ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. తాజాగా సామ్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేసి సామ్‌కు చై ఫ్లాట్ ఇచ్చి బయటకు వెళ్లాడనే పుకార్లు వ్యాప్తి చేసే వారు ఇకపై సమంత అభిమానుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.