Samantha: స్టార్ హీరోయిన్ సమంతా మయోసైటిస్ వ్యాధికి గత ఏడాది ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రీట్మెంట్ కోసం ఆమె ఏకంగా 7 నుంచి ఎనిమిది నెలల పాటు హాస్పిటల్ లోనే ఉంది. బయటి ప్రపంచానికి దూరంగా మళ్ళీ తిరిగి ఆరోగ్యంతో బయటపడేందుకు ప్రయత్నం చేసింది. ఇక సమంత పోరాటం వృధా పోలేదు. ఆమె మయోసైటిస్ ని జయించి కోలుకొని ఆరోగ్యంగా బయటకి వచ్చింది. మళ్ళీ సినిమా షూటింగ్ ల కోసం సిద్ధం అవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఆమె జిమ్ లో ట్రైనర్ తో కలిసి వర్క్ అవుత చేస్తున్న ఫోటోలని పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో పాటు ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తర్వాత మరల అదే దర్శకులతో సమంతా యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిటాబెల్ కి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. ఇందులో సమంతకి పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఆ వెబ్ సిరీస్ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతుంది. మరో వైపు రాజ్ అండ్ డీకే దర్శకులతో కలిసి సమంత స్క్రిప్ట్ డిస్కసన్ లో పాల్గొంది ఈ ఫోటోని కూడా ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. అలాగే సిటాబెల్ వెబ్ సిరీస్ కి సంబంధించి సమంత ఎలాంటి లుక్ లో కనిపించబోతుంది అనేది ఒక ఫోటోతో రివీల్ చేసింది.
ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే మయోసైటిస్ తో తాను ఎలా పోరాడి గెలిచింది ఒక టెక్స్ట్ రూపంలో సమంత పంచుకుంది. తనకి తాను ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఆ వ్యాధి నుంచి తాను జయించిన విధానాన్ని సమంత చాలా హృద్యంగా పంచుకుంది. ఇదిలా ఉంటే సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మళ్ళీ ఈ నెల ఆఖరులో లేదంటే మార్చిలో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ మరో వైపు ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.