హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమాలు, పర్సనల్ లైఫ్, ఫిట్నెస్ సహా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా ఫిట్నెస్ పై దృష్టి పెడుతుంది. సమంత ఫిట్నెస్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతయో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో సామ్ వర్కవుట్స్ చేస్తుంటే, తన పెట్స్ హాష్, సాషాలు గొడవ పడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఇంట్రస్టింగ్ కామెంట్ పెట్టింది.. జీవితంలో సిబ్లింగ్స్ మధ్య సమస్యలు వస్తుంటాయని నాకు ముందే తెలుసు అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చింది. అయితే గొడవ పడ్డా మళ్లీ తొందరగా అవి కలిసిపోయాయంటూ ఫోటోలను షేర్ చేసింది