Samantha : అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ ప్యాన్ ఇండియా మూవీగా వచ్చి దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాతో పాటు పాటలు కూడా హైలైట్ కావడంతో సినిమా రేంజ్ మారిపోయింది. ఇక సినిమాలో స్పెషల్ సాంగ్ యూత్‌ను మరింత ఆకట్టుకుంది. ‘ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా’ అంటూ స్టార్ హీరోయిన్ సమంత వేసిన స్టెప్పులకు బాలీవుడ్‌ను సైతం ఊపేసింది. పెళ్లి తర్వాత అమ్మడు ఐటెం సాంగ్స్‌కు సైతం ఊ కొట్టేసి ఆకట్టుకుంటోంది. తాజాగా సామ్ మరోసారి ఊ అంటావా సాంగ్‌కు స్టెప్పులేసి ఆకట్టుకుంది. అయితే ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి స్టెప్పులేసింది.
Samantha : వీళ్ల జోడీ చెత్తగా ఉందంటూ..
కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో సామ్, అక్షయ్ కలిసి ఓ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో అక్షయ్.. సామ్‌ను ఎత్తుకుని స్టేజీ మీదకు తీసుకురావడం ఆకట్టుకుంది. ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అంటూ సామ్, అక్షయ్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వేసిన స్టెప్స్ పెద్దగా ఏమీ లేకున్నా కూడా కామెంట్స్ మాత్రం హోరెత్తుతున్నాయి. వీళ్ల జోడీ అదిరిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం చాలా చెత్తగా ఉందంటూ నిందిస్తున్నారు. నిజానికి ఇద్దరి జోడి అంతగా ఆకట్టుకునేలా లేదు. మరి ఇక అమ్మడి ఫ్యాన్స్‌కు ఎలా నచ్చుతుంది? కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం అమ్మడు అందానికి ఫిదా అవుతున్నారు.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. తెలుగుతో పాటుగా తమిళ్.. బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. బోల్డ్ క్యారెక్టర్స్‌కు సైతం నో చెప్పడం లేదు. ఏ అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఒక మూవీ చేస్తోంది. ఇది ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో కూడా మూడు, నాలుగు సినిమాలకు సైన్ చేసిందని టాక్. మొత్తానికి అమ్మడు చూడబోతే ఇండియాను ఏలేశాలా ఉంది.