అభిమానులు ముద్దుగా విజయ దేవరకొండ అభిమానంతో రౌడీ స్టార్ అని పిలుచుకుంటే, విజయమో తన ఫ్యాన్స్ , ఫాలోవర్స్‌ను ప్రేమతో రౌడీస్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. లైగర్ మూవీ ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయనతో పాటు ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న సినిమా భారీ రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతుందీ సినిమా. ఇది పూర్తి కాక మునుపే విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే ‘జనగణమన’ సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగానే పూర్తి చేస్తారని సమాచారం.
పరిస్థితి చూస్తుంటే విజయ్ దేరవకొండతో సినిమా చేయడానికి చాలా కాలంగా వెయిటింగ్‌లో ఉన్న దర్శకుడు శివ నిర్వాణ కొన్ని నెలలు ఆపక తప్పేలా లేదు. అయితే శివ నిర్వాణ స్క్రిప్ట్ వర్క్‌ను మెరుగులు దిద్దడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటున్నారు. తాజా సినీ సర్కిల్స్ లో ఉన్న సమాచారం మేరకు ఈ చిత్రంలో చెన్నై బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటించనుందట. అంతే కాదు. ఈ సినిమా కోసం సమంత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. మూడు కోట్ల రూపాయలను అడగ్గా మేకర్స్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతుంది.
ఇది వరకు విజయ్ దేవరకొండ, సమంత.. మహానటి చిత్రంలో జోడీగా నటించిన విషయం తెలిసిందే. అందులో వారి పాత్రలు పరిమితమే అయినా.. చాలా కీలకమైనవి. ఇప్పుడు శివ నిర్వాణ సినిమాలో మరోసారి జంటగా కనిపించబోతున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఘన విజయం సాధించిన ‘మజిలీ’ చిత్రంలో సమంతనే హీరోయిన్ గా చేసింది. అదే సెంటిమెంట్‌తో శివ ఆమెను హీరోయిన్‌గా చేయాలని అప్రోచ్ కావడం జరిగిందని సమాచారం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.