Samantha : సమంతకు బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ దొరికినట్టేనా? అంటే అవుననే సమాధానమే బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కరుణా కటాక్షాలు.. కాస్త టాలెంట్ ఉంటే చాలు నటుల దశ తిరిగిపోయినట్టే. శ్రీదేవి కూతురికి కరణ్ గాఢ్ ఫాదర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ సెన్సేషన్ సమంతకు కూడా ఆయన గాఢ్ ఫాదర్‌గా మారినట్టు టాక్ బలంగానే వినిపిస్తోంది. హిందీలో మూవీ సైన్ చేయాలంటే కరణ్ హెల్ప్ తీసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామ్ హిందీలో 3 సినిమాలు ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఇక బాలీవుడ్‌లో తన ఫుట్ ప్రింట్‌ను మరింత బలంగా వేయడం కోసం సామ్.. ప్రతి దానికీ కరణ్ సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Samantha : ఆ షోనే సామ్‌ని కరణ్‌కు దగ్గర చేసింది..
అటు నిర్మాతగానే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంతో ఆయన దూసుకుపోతున్నారు. ఇతర నిర్మాతల్లా కాకుండా ఆయన తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున‍్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షోనే సామ్‌ని కరణ్‌కు దగ్గర చేసిందని టాక్. ఈ షో తర్వాత బాలీవుడ్‌లో తను వేయబోయే ప్రతీ అడుగూ కరణ్ సారధ్యంలోనే వేస్తోందట. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుతున్నాయి. ఇప్పటివరకూ బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిన సామ్.. కరణ్ సపోర్ట్‌తో ఇప్పుడు అక్కడ కూడా తన సత్తా చాటాలని అనుకుంటోంది. సమంత.. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక త్వరలోనే బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుందని ప్రచారం జోరుగానే సాగుతోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. దినేష్ విజయ్ ఈ సినిమాను నిర్మిస్తారట. అలాగే ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీకి సైతం సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మరోవైపు హీరోయిన్ తాప్సీ నిర్మాణ సంస్థ అవుట్‌సైడర్స్ ఫిలింస్‌లో సమంత ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ చేయనున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి.