Samantha Ruth Prabhu : సౌత్ స్టార్ బ్యూటీ నటి సమంత రూత్ ప్రభు ట్విట్టర్‌లో విజయ్ దేవరకొండతో నటిస్తోన్న తెలుగు రొమాంటిక్ డ్రామా ఖుషి మూవీ కి సంబంధించి ఒక అప్డేట్ ను పంచుకుంది. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ, విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పి, సినిమా షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభమవుతుంది అని రిప్లై ఇచ్చింది. మహానటి తర్వాత సమంత విజయ్‌ల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఖుషి.
గత ఏడాది మేలో ఖుషి మూవీకి సంబంధించిన పోస్టర్‌తో పాటు ఖుషి టైటిల్‌ను మూవీ యూనిట్ ఆవిష్కరించింది. అప్పట్లో సమంత రూత్ ప్రభు ఈ మూవీ ని గొప్ప చిత్రంగా అభివర్ణించింది. కాశ్మీర్‌లో ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత, సామ్ తాను మయోసిటిస్ అనే అరుదైన ఆటో-ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించడంతో షూటింగ్ ఆగిపోయింది. చికిత్స పొందుతుండటంతో సమంత తన షూటింగ్ లకు పాజ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల, కుషి షూటింగ్ చాలా నెలలు వాయిదా వేయవలసి వచ్చింది. షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి సమంత నుండి తాజా డేట్స్ కోసం మేకర్స్ వేచి ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఖుషి షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సమంత కుషి అతి త్వరలో తిరిగి ప్రారంభమవుతుంది అని రిప్లై ఇచ్చింది. విజయ్ దేవరకొండ అభిమానులకు నా క్షమాపణలు అని సమంత ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ఇక అభిమానులు తన ఆరోగ్యాన్ని ముందు చూసుకోమని కోరారు.