Samantha Ruth Prabhu : సౌత్ పోస్ట్ కు గట్టి రిప్లై ఇచ్చి తాను ఎప్ప స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు తన ఇష్ట లో పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ఈ బ్యూటీ శాకుంతలం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సామ్ తెల్లని చీర కట్టుకుని తళుక్కుమంది. సామ్ ప్రస్తుతం ఆరోగ్యాంగానే ఉన్నా చాలా మంది సామ్ చిక్కిందని , బలహీణంగా మారింది అని సమంత ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు.

ఒక వ్యక్తి ఏకంగా సామ్ ఫోటో పోస్ట్ చేసి మరి నువ్వు వీక్ అయ్యావ్ అని పేర్కొన్నాడు. మరి ఈ విషయాన్నీ సామ్ సీరియస్ గా తీసుకుంది కాబోలు. బలహీనంగా మారిందని పిలిపించుకున్న కొన్ని రోజుల తర్వాత, సమంతా రూత్ ప్రభు తాను చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసేందుకు తన మజిల్ బాడీ పిక్ ను పోస్ట్ చేసి ఆ కామెంట్ ని తిరిగి కొట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, సమంతా జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఫోటోలో, సమంత పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన టాప్ ధరించి తన కండరాలను చూపించింది. నటి తన పిడికిలిలో ఒకదానిని ఆమె ముఖానికి దగ్గరగా ఉంచి, ఆమె మోచేతిని ఒక వస్తువు పై ఉంచి పోజులు ఇచ్చింది . సమంత తన ఎదురుగా ఉన్న అద్దం చూస్తూ నవ్వినా పిక్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. సమంత ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్ షేక్ నవ్వుతూ ఉన్నా సామ్ ఫోటోను క్లిక్ చేశాడు. ఈ పిక్ ని పోస్ట్ చేసి నేను చేయగలిగితే మీరు చేయగలరు అని కాప్షన్ ను జోడించింది.

శాకుంతలం ట్రైలర్ లాంచ్ నుండి ఆమె చిత్రాలను షేర్ చేసి, ఆమెపై వ్యాఖ్య చేసిన వారం తర్వాత సమంతా ఈ పోస్ట్ వచ్చింది. ఆ ట్వీట్‌లో, “సమంతను చూస్తే బాధగా ఉంది, ఆమె తన అందాన్ని మెరుపును కోల్పోయింది. ఆమె విడాకుల నుండి బయటకు వచ్చి , వృత్తిపరమైన జీవితం ఎత్తులో ఉందని అందరూ భావించినప్పుడు, మైయోసైటిస్ ఆమెను తీవ్రంగా దెబ్బతీసింది, ఆమెను మళ్లీ బలహీనపరిచింది అని ఉంది. ఈ పోస్ట్ కు గట్టి రిప్లై ఇచ్చి తాను ఎప్పటికి స్ట్రాంగ్ అని మరోసారి నిరూపించింది సామ్.
