Samantha Ruth Prabhu : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలో విడుదల కాబోయే చిత్రం శాకుంతలం నుండి కొన్ని కొత్త స్టిల్స్‌ను తన ఇన్ స్టాగ్రామ్ పేజీ లో పంచుకుంది. పౌరాణిక నాటకంలో శకుంతల పాత్రలో నటించిన ఈ నటి పుష్పాలతో చేసిన నగలని అలంకరించుకుని తెల్లని వస్త్రాలు ధరించి దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా అద్భుతంగా కనిపిస్తుంది.
అభిమానులు ఆమె రూపాన్ని చూసి ముగ్ధులయ్యారు. చాలా మంది హార్ట్ ఎమోజీలు కామెంట్స్ పోస్ట్ చేసి సమంతను పొగడ్తలతో ముంచేశారు. ఈ పోస్ట్‌పై సమంత మాజీ భర్త నాగ చైతన్య కోడలు ఆశ్రిత దగ్గుబాటి కూడా స్పందించింది.
యశోద హిట్ తో మంచి ఊపు మీద ఉన్న సామ్ తన తదుపరి ప్రాజెక్ట్ శాకుంతలం ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉంది. అందులో భాగంగానే నెట్టింట్లో ఫోటోలు పోస్ట్ చేసి దానికి “నీ కోసం మల్లికా శాకుంతలం” అని క్యాప్షన్ ను రాసింది .ఈ లుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తప్పకుండా దోచుకుంటుంది అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు సమంత లుక్స్ పైన నెటిజన్లు ఒక్కోరు ఒక్కోలా కామెంట్స్ చేసారు మునుపటి చార్మింగ్ , క్యూట్ నెస్ సామ్ లో లేదని , చాలా వీక్ గా కనిపిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఇప్పటికి స్ట్రాంగ్ అని నిన్న జిమ్ బాడీ తో ఉన్న పిక్ పోస్ట్ చేసి చెప్పకనే చెప్పిన సమంత , నేడు తనలోని అప్సరసను మరోసారి బయటకు తీసింది. దీనితో సామ్ ఇస్ బ్యాక్ అని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
వర్క్ ఫ్రంట్‌లో, సమంతా రూత్ ప్రభు త్వరలో డోన్టన్ అబ్బే డైరెక్టర్ ఫిలిప్ జాన్‌తో అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్‌లో పని చేయనుంది . సమంతా ది ఫ్యామిలీ మ్యాన్ 2తో పెద్ద డిజిటల్ రంగ ప్రవేశం చేసింది, దాని కోసం ఆమె రాజి పాత్రలో దూరి అందరికి కన్నీటి అయ్యింది. రస్సో బ్రదర్స్ సిటాడెల్‌లో కూడా నటి కనిపించనుంది.