Samantha Ruth Prabhu : సినిమాల విషయానికి వస్తే సమంత ఎంత డెడికేటెడ్ గా ఉంటుందో అందరికి బాగా తెలుసు. ఈ బ్యూటీ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తుంది. ప్రతి సినిమాలో ఆమె చూపే వేరియేషన్స్ అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో సమంత ను దగ్గరుండి చుసిన సహా నటుడు ఆమె గురించి న ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు మనోజ్ బాజ్‌పేయి. మీరు మిమ్మల్ని కష్టపెట్టకుండా సులువుగా వెళ్లాలని కూల్ గా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మనోజ్ బాజ్‌పేయి తన రాబోయే చిత్రం గుల్మోహర్ ప్రచార కార్యక్రమంలో సమంత గురించి యాంకర్ ఏదైనా చెప్పమని అడిగినప్పుడు అయన ఈ విషయాన్నీ షేర్ చేసాడు.

ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ లో సమంత చాలా కష్టపడి పనిచేసేది అని షూటింగ్ విషయాలను పంచుకున్నారు. సమంతా అంకితభావాన్ని దగ్గరుండి చూసాను అని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్ సెట్స్‌లో తాను శారీరకంగా పని చేసిన విధానం చూసి నాకు భయం వేసింది అని అన్నారు. తనను తాను ఎంత కష్టపెట్టుకునేదో నాకు తెలుసన్నారు.
మనోజ్ బాజ్‌పేయి ఈ ఇంటర్వ్యూ స్నిప్పెట్‌ను సమంత తన ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంది. దీనికి రిప్లై గా నేను ప్రయత్నిస్తాను సార్ అని సమంత రాసింది. ఈ పోస్ట్ తో పాటు హార్ట్ ఎమోజీలను కూడా పంచుకుంది. ప్రస్తుతం సమంత ఈ రిప్లై నెట్టింట్లో వైరల్ అవుతోంది.
🤗🫶🏻 will try sir @BajpayeeManoj https://t.co/PP4h4Ly7ES
— Samantha (@Samanthaprabhu2) February 15, 2023
ఫ్యామిలీ మ్యాన్ స్పై థ్రిల్లర్ సిరీస్ రెండవ సీజన్‌లో ఆత్మాహుతి మిషన్‌లో తిరుగులేని శ్రీలంక తమిళ విముక్తి యోధురాలు రాజి పాత్రను సమంత పోషించింది.ఈ పాత్ర ఆమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. సమంత వీరోచిత నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

సమంతా రూత్ ప్రభు గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. దేవ్ మోహన్ దుష్యంతగా కనిపించనున్నాడు. మోహన్ బాబు, మధు, గౌతమి, అదితి బాలన్ ,అనన్య నాగళ్ల ఈ చిత్రంలో భాగం అయ్యారు . మేకర్స్ షేర్ చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం, శకుంతలం ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది.