Senior Actress Jamuna : ప్రముఖ సీనియర్ నటి జమున రాణి (86) కొన్నిగంటల క్రితం ఆమె స్వగృహంలో కన్నుమూశారు. తెలుగు, తమిళంతో పాటుగా మిగతా దక్షిణ భారత భాషలలో 200 కి పై చిలుకు సినిమాలలో నటించారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టిన ఆమె పలు సూపర్ హిట్ హిందీ చిత్రాలలోనూ నటించారు. జమున రాణి 1936 ఆగష్టు 30న హంపీలో నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకి జన్మించారు.
జమునకు ముందు పెట్టిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం ప్రకారం ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు సూచించడంతో ‘ము’ అనే అక్షరంను మధ్యలో చేర్చి జమునగా మార్చుకున్నారు. సినీనటుడు జగ్గయ్య, జమున కుటుంబానికి మంచి అనుబంధం ఉంది.
Senior Actress Jamuna : జమున చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలిచారు.
జగ్గయ్య, గుమ్మడి లాంటి దిగ్గజ నటులతో కొన్ని నాటకాలను వేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే బి.వి.రామానందం రూపొందించిన పుట్టిల్లు సినిమాలో ఆమెకు తొలి సారిగా అవకాశం వచ్చింది. ఈ చిత్రం తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు లాంటి అగ్ర తారల సరసన హీరోయిన్గా నటించారు. అలా 200 సినిమాలలో హీరోయిన్గా నటించిన జమున చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలిచారు.