Tabu : సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మ టబు.. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. కాగా.. ఆమె తాజాగా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భోలా’. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో టబు నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో టబు తీవ్రంగా గాయపడింది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు సమాచారం.
కంటికి.. నుదిటిపై.. కనుబొమ్మలకు గాయమై తీవ్రంగా రక్తస్రావం అవుతుండగా యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కంటికి.. నుదిటిపై.. కనుబొమ్మలకు గాయమై తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా సమాచారం. దీంతో వెంటనే అక్కడే ఉన్న టెక్నీషియన్స్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి టబును తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. మరోవైపు టబు కోలుకునే వరకూ భోలా సినిమా షూటింగ్ నిలిచిపోనుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం 2023 మార్చి 30 విడుదల కానుంది.
Tabu : మరో షూటింగ్‌లో గాయపడిన శిల్పాశెట్టి
ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్‌కు విరామం ప్రకటించారు. అయితే రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. కంటికి వెలుపల దెబ్బ తగిలింది కానీ.. కంటికి ఏమీ కాలేదని తెలుస్తోంది. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్‌లో సైతం హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం.