Sharukh Khan : ఇటీవలి కాలంలో స్టార్ హీరో ఎటు వెళ్లినా చాలా సీక్రెట్‌గా వెళ్లి వస్తున్నారు. ఫ్యాన్స్ భయమో.. మీడియా భయమో తెలియదు కానీ ఆయన మాత్రం చాలా సీక్రెట్‌గా పర్యటిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. షారుఖ్ ఖాన్. అభిమానులు చూస్తే.. సెల్ఫీలు అంటూ మీద పడతారు. ఇబ్బందులకు గురిచేస్తారు. ఒక్కొక్కసారి వారి అభిమానం భయపడే స్థాయిలో ఉంటుంది. ఇలా భయపడి పరుగులు తీసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వీరిలో తాజాగా షారుఖ్ సైతం చేరిపోయాడు. తాజాగా తన ఫ్యాన్స్‌ను చూసిన బాలీవుడ్ బాద్షా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు.
Sharukh Khan : లండన్‌లో సైతం ప్రశాంతంగా ఉండనివ్వని ఫ్యాన్స్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. ఈ క్రమంలోనే ఆయన కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని తిరిగి ఫుల్ జోష్‌తో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘పఠాన్’ మూవీ కంప్లీట్ చేసిన బాద్షా ‘డుంకీ’ చిత్రీకరణలో పాల్గొన్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. లండన్‌లో సైతం షారుఖ్‌ను అభిమానులు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. షూటింగ్ స్పాట్లో ఆయన్ను గుర్తుపట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆయన దగ్గరకు వెళ్లేందుకు యత్నించగా.. అది గమనించిన షారుక్ ఖాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కడంతో కాస్త దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాగానే కొంత రిలాక్స్ అయ్యాడు కానీ.. మీడియా ముందుకు మాత్రం పెద్దగా రాలేదు. ఆ సమయంలో సెలబ్రిటీలు జరుపుకునే పార్టీలకు సైతం మీడియా కంట పడకుండా సీక్రెట్‌గానే హాజరయ్యాడు. స్టార్ హీరో మీడియా ముందుకు వచ్చే మూడ్‌లో లేడని, రానున్న కాలంలో ప్రెస్ మీట్లకు వీలైనంత దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్ట బీటౌన్ సర్కిల్లో టాక్ కూడా నడిచింది. మరి తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనైనా షారుఖ్ మీడియా ముందుకు వస్తాడా..? లేదా..? అనేది చూడాలి.