Sharwari Wagh : బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఉంటుంది. క్యాజువల్ అవుట్ ఫిట్ ల నుండి పండుగ కోసం పర్ఫెక్ట్గా మెరవడం వరకు అన్ని సందర్భాల్లో , శార్వరికి సింపుల్ గా స్టన్నింగ్ గా ఎలా కనిపించాలో బాగా తెలుసు. తనని తాను చిక్ గా స్టైలిష్‌గా ఎలా ఉంచాలో ఈ భామకు తెలుసు. తాజాగా ఈ క్యూటీ తన ఇన్ స్టాలో లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుంది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

శార్వరి తన ఫోటో షూట్ కోసం తెల్లటి ట్యాంక్ టాప్ ఎంచుకుని దానికి మ్యాచింగ్ గా తెల్లటి డెనిమ్ డిస్ట్రెస్డ్ షార్ట్ వేసుకుని టాప్ ను టక్ చేసింది. సూర్యుని కిరణాలను ముద్దడుతూ కెమెరాకు పోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో షార్వారి తన ఫిగర్ ను స్పష్టంగా చూపిస్తోంది. తన ఉంగరాల కురులను లూస్ గా వదులుకుని దిగిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేసాయి.

కనులకు న్యూడ్ ఐ షాడో, కాను రెప్పలకు మస్కరా , పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని శార్వరి తన సింపుల్ లుక్ తో అదరగొట్టింది.

శార్వరి ఎత్నిక్ ఫ్యాషన్ డైరీలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ భామ ఫాలో అయ్యే ట్రెండ్స్ ఫ్యాషన్ లవర్స్ ను ఇంప్రెస్స్ చేస్తాయి. రీసెంట్ గా తెల్లటి లెహంగా సెట్ వేసుకుని అద్భుతమైన ఫోటో షూట్ చేసింది శార్వరి. ఈ ఫోటో షూట్ పిక్స్ కు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

శార్వరి పొడవాటి స్లీవ్‌లు డీప్ నెక్లైన్ తో ఉన్న ఐవరీ వైట్ సెక్విన్డ్ బ్లౌజ్‌ని వేసుకుని దానికి జోడిగా వెండి మిర్రర్వర్క్ను కలిగి ఉన్న మ్యాచింగ్ లాంగ్, ఫ్లోయి స్కర్ట్‌ను ధరించింది. ఈ లెహంగా సెట్ కు జార్జెట్ దుపట్టాను జోడించి ,ఆమె తన రూపాన్ని పూర్తి చేసింది. ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
