Shillong : మేఘాలయలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా బీఫ్ తింటానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ తెలిపారు. ఎర్నెస్ట్ మావ్రీ మీడియాతో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేను ప్రకటన చేయలేను అని ఆయన అన్నారు. మేఘాలయలో అందరూ గొడ్డు మాంసం తింటారు, ఇక్కడ ఎటువంటి పరిమితులు లేవు. అవును నేను కూడా బీఫ్ తింటాను. అదుకే ఇక్కడ నిషేధం లేదు అని పేర్కొన్నారు. మేఘాలయా ప్రజల జీవనశైలిలో బీఫ్ ఒక భాగం అయిపోయిందని, దీనిని ఎవరూ ఆపలేరు అని అన్నారు. కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలు చేశాయన్నారు. మేఘాలయలో కబేళా ఉందని, అందరూ ఆవును లేదా పందిని తీసుకుని అక్కడికి తీసుకువస్తారన్నారు. బీజేపీ చీఫ్ ఈ ప్రకటనతో ఈ టాప్ ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్ గా మారింది.

అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పశువధ, గోమాంసం రవాణా, విక్రయాల నియంత్రణ బిల్లును ఆమోదించిన తరుణంలో, ఈశాన్య ప్రాంతంలో బీజేపీకి చెందిన అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మ హిందువులు నివసించే ప్రాంతాల్లో గొడ్డు మాంసం తినడంపై ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి బిజెపి క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన మేఘాలయ బిజెపి చీఫ్ ఇది కేవలం రాజకీయ ప్రచారం అని అన్నారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిదేళ్ల జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం నడుస్తోందని, దేశంలో ఏ చర్చిపై కూడా దాడులు జరగలేదని, టార్గెట్‌గా దాడులు జరగలేదని, బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఆరోపిస్తోందని అన్నారు.

గోవాలో కూడా బిజెపి అధికారంలో ఉందని అక్కడ ఏ ఒక్క చర్చిని కూడా లక్ష్యంగా చేసుకోలేదన్నారు. నాగాలాండ్‌లో కూడా అదే విధంగా ఉందన్నారు. ఇది కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టిఎంసి లతో పాటు రాష్ట్రంలోని కొన్ని మిత్రపక్షాలు చేస్తున్న రాజకీయ ప్రచారం అని అన్నారు. ఇందులో విస్తవం లేదన్నారు. నేను కూడా క్రిస్టియన్నే, చర్చికి వెళ్లవద్దని వాళ్లు ఎప్పుడూ చెప్పరు అని ఎర్నెస్ట్ మావ్రీ ప్రశ్రించారు.
అదే విధంగా మేఘాలయలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఈసారి మేఘాలయ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలు వాడీవేడిగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఎలక్షన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయి.