Prabhas : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతాడా? అని అభిమానులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే జ్యోతిష్యుడు వేణు స్వామి మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పాడు. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన పెళ్లి చేసుకోక పోవడం మంచిది అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖుల జాతకం చెప్పి వార్తల్లో నిలిచిన ఆయన తాజాగా ప్రభాస్ జాతకం కూడా చెప్పాడు. ఇప్పటి వరకూ ఆయన జాతకాలు నిజమైన దాఖలాలైతే దాదాపు లేవు.. అలాగని ఆయన జాతకాలు చెప్పడం మాత్రం ఆపరు.
ప్రభాస్‌కు పెళ్లి కలిసి రాకపోవచ్చు అని.. ఆయన పెళ్లి చేసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కోవలసి రావచ్చని వేణు స్వామి వెల్లడించాడు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే భార్యతో సైతం గొడవలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపాడు. నాలుగు పదుల వయసు దాటిన ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేణు స్వామి ఇచ్చిన షాక్‌తో ప్రభాస్ ఇక పెళ్లి చేసుకోడేమోనని ఆందోళన చెందుతున్నారు. మరి వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Prabhas : ప్రభాస్ గురించి వైరల్ అవుతున్న న్యూస్
‘బాహుబలి’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన ‘సాహో, రాధేశ్యామ్’ చిత్రాలు సైతం ప్యాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. ఇక రాధేశ్యామ్‌లో ప్రభాస్ సైతం జ్యోతిష్యుడిగానే నటించాడు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి విషయం మాత్రం మాట్లాడటం లేదు. ఇక ప్రభాస్ గురించి ఇటీవలి కాలంలో ఓ న్యూస్ సైతం వైరల్ అవుతోంది. రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీుకుంటున్న హీరోల్లో ప్రభాస్ కూడా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలకు రూ.100 కోట్లకు పైనే ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది.