shriya saran : శ్రియా సరన్ నిజమైన ఫ్యాషన్ వాది ఈ విషయాన్నీ ఎవరు కొట్టి పారేయలేరు. నటి చాలా కలం విరామం తర్వాత వినోద పరిశ్రమలోకి స్టైలిష్ లుక్స్ తో ఎంట్రీ ఇస్తోంది. పెళ్లై, ఓ పాపకు తల్లైన తన అందాలు తరగలేదని తన లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ప్రూవ్ చేస్తోంది ఈ బ్యూటీ.

వయస్సు కేవలం సంఖ్య అని మరోసారి నిరూపించింది శ్రియ. చాన్నాళ్ల తర్వాత దృశ్యం 2లో కనిపించిన శ్రియ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ఎప్పటిలాగే గ్లామర్‌గా కనిపించింది. ఆ ఈవెంట్ కోసం ఈ బ్యూటీ అందమైన ఉల్లిపొర డ్రెస్ వేసుకుని అందరిని అట్రాక్ట్ చేసింది.

ప్రముఖ డిజైనర్లు గౌరీ అండ్ నైనికా డిజైన్ చేసిన పూలతో కూడిన గౌను ధరించి ఈ 40 ఏళ్ల స్టార్ సూర్యకాంతి కిరణాల నడుమ చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

శ్రియా దక్షిణ భారత సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన నటి. ఆమె తన అద్భుతమైన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలతో ఫాలోవర్స్ ను మంత్రముగ్ధులను చేయడంలో ఎప్పుడూ బిజీ గా ఉంటుంది. తాజాగా ఈ ఉల్లిపొర డ్రెస్ పిక్స్ ను శ్రియా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. నటి తెల్లటి పూల దుస్తుల్లో దేవకన్యలా ఉందంటూ ఫ్యాన్స్ పోగడ్తలతో ముంచేస్తున్నారు.
