ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా భారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ వచ్చింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటానని చెబుతూ శ్రుతి హాసన్ తన మెసేజ్‌ను షేర్ చేశారు. కరోనా థర్డ్ వేవ్‌లో సినీసెలబ్రిటీలు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ లిస్ట్ లో శ్రుతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కూడా ఉన్నారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాయి అని అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ శ్రుతి హాసన్ కరోనా బారిన పడటం కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితి అని చెప్పాలి. శ్రుతి హాసన్ అభిమానులు ఫాలోవర్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.
శ్రుతి హాసన్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈమె తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్నNBK 107వ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. ఇవి కాకుండా ప్రభాస్ జోడీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సలార్ చిత్రంలోనూ కథానాయికగా చేస్తోంది.
మైకేల్ కోర్సల్‌తో ప్రేమాయణం నడిపిన శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ కెరీర్‌ను స్టార్ట్ చేసింది. తెలుగులో క్రాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శృతి బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో ప్రభాస్ మూవీ సలార్ చిత్రంలో, బాలకృష్ణ 107వచిత్రంలో అవకాశాలను అందుకుంది. ఇప్పుడు డూడల్ ఆర్టిస్ట్ శాంతను హాజరికాతో ప్రేమలో ఉంది . ఒకవైపు ప్రేమ, మరో వైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ లో ముందుకు తీసుకెళుతుంది శ్రుతి హాసన్.