సౌత్ ఇండియాలో సిల్క్ స్మిత పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 20వ దశబ్దంలో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నటి సిల్క్ స్మిత. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సిల్క్ హవ కొంతకాలం నడిచింది. అప్పట్లో ఆమె ఐటెం సాంగ్ లేకుండా సినిమాలు ఉండేవి కాదంటే ఎంతగా ఆమె పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎంతగా గుర్తింపు సొంతం చేసుకుందో ఆమె మరణం కూడా అంతే మిస్టరీగా మారింది. ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె మరణానికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్తారు. అయితే నిజం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే 2011 లో హిందీలో సిల్క్ స్మిత బయోపిక్ గా ది డర్టీ పిక్చర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో టైటిల్ రోల్ ను విద్యాబాలన్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విద్యాబాలన్ కి కూడా నటిగా ఈ మూవీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సిల్క్ స్మిత జీవిత కోణాన్ని అందులో అద్భుతంగా ఆవిష్కరించారు. ఏక్తా కపూర్ ఆ సినిమాని నిర్మించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కించాలనే ప్రయత్నంలో మరల ఆమె ప్రయత్నాలు చేస్తుంది. సిల్క్ స్మిత జీవితంలో ఎవరికి తెలియని కోణాలను ఈ సీక్వెల్లో ఆవిష్కరించాలని ఏక్తాకపూర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో టైటిల్ రోల్ కోసం మరల విద్యాబాలన్ ని సంప్రదించగా ఆమె చేయడానికి నిరాకరించినట్లు సమాచారం.
కథ తనకు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి విద్యాబాలన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏక్తాకపూర్ మరో హీరోయిన్ కోసం సెర్చ్ చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కాంగన రనౌత్ ఎంటర్ అయినట్లు టాక్. సిల్క్ స్మిత టైటిల్ రోల్ కోసం తాను నటించడానికి రెడీగా ఉన్నట్లు వినిపిస్తుంది. కాంగనా రనౌత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏక్తా కపూర్ ప్రాజెక్ట్ ని చాలా గ్రాండియర్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సీక్వెల్లో సిల్క్ స్మిత కథనే కొనసాగిస్తారా లేదా కొత్త స్టోరీ ఏదైనా చెప్తారా అనేది వేచి చూడాలి.