బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ లను కూడా ఫైనలైజ్ చేశారు. మొత్తం 19 మందిని ఈ సీజన్లో హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇందులో చాలామంది ఫేమ్ ఉన్న సెలబ్రిటీ ఉండడం విశేషం. యూట్యూబ్ స్టార్స్ ని కూడా ఈ సీజన్లో హౌస్ లోకి పంపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ కోసం ఎంపిక చేశారు. అలాగే సీరియల్ స్టార్స్ ని కూడా హౌస్ లోకి పంపిస్తున్నారు. సీరియల్ లో బాగా పాపులర్ అయిన అమర్ దీప్ చౌదరి ఈసారి బిగ్ బాస్ కోసం ఎంపిక చేశారు.
ఇదిలా ఉంటే ప్రతి సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో ఒక సింగర్ ని కూడా పంపిస్తున్నారు. ఈసారి అవకాశం వర్ధమాన గాయని మోహన్ భోగరాజుకి లభించినట్లు తెలుస్తుంది. బుల్లెట్ బండి అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ ఊహించని విధంగా మోహన్ బోగరాజుకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఈసారి బాగా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మోహన్ భోగరాజు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించడం జరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది.
మరో వైపు ఈసారి హౌస్లోకి వెళ్ళబోతున్న వారిలో పైన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రిడిక్షన్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈసారి పార్టిసిపేట్ చేయబోయే వారి గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఎవరు ఉంటారు అనేది ఒక రెండు వారాలపాటు అని చెప్పలేమని చాలామంది అనుకుంటున్నారు. మరి హౌస్ లోకి వెళ్తున్న వారిలో ఎవరి బలం ఎంత, హౌస్ లో వారు మొదటి రెండు వారాలు వారి ఆట తీరు, వ్యక్తిత్వంతో ఎలా ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు అనేదానిపై అందరూ ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుంది.