Sonakshi Sinha : బాలీవుడ్ భామ సోనాక్షి సిన్షా బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుజ్ఞ సిన్హా కూతురు. సినిమాలకు వ్యక్తిగత ఫ్యాషన్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ బ్యూటీ. అనంతరం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో దబంగ్ మూవీతో సోనాక్షి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మొదటిదే అయినా అమ్మడు ఆక్టింగ్ ఇరగదీసింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా అమ్మడి చాలా ఫేమస్ అయ్యింది. తమిళంలో రజినీకాంత్ సరసన లింగా సినిమాలో కనిపించి సౌత్ ను పలకరించింది. ఆ తరువాత మరే సినిమాకు సైన్ చేయలేదు. రీసెంట్‌గా బాడీషేమింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన బాలీవుడ్ మూవీ డబుల్ ఎక్స్‌ఎల్ లో నటించి తన నటనతో ఎప్పటిలాగే మెప్పించింది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడు చేసే హాట్ ఫోటో షూట్‌లతోనూ ఫ్యాషన్ పై తనకున్న ప్రేమను తెలియజేస్తుంది. తాజాగా సోనాక్షి సిన్హా తన తాజా ఫోటోషూట్ కోసం ఈ అందమైన రూపాన్ని సృష్టించడానికి భారతీయతను పాశ్చాత్యాన్ని మేళవించిన అందమైన అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను ధరించింది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీని కలిగిన జాకెట్ దారికి జోడీగా ధోతీ స్కర్ట్ సెట్‌ను ధరించింది. ఈ ఇండో వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో ఎంతో అందంగా అద్భుతంగా కనిపించింది సోనాక్షి. ఈ ఫోటో షూట్ పిక్స్‌ను ఎప్పటిలాగే తన ఇన్‌ష్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

సోనాక్షి సిన్హా దుస్తులను డిజైనర్ అనామికా ఖన్నా ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్‌ల నుండి సేకరించింది. సోనాక్షి సిన్హా సెట్‌లో రంగురంగుల ఎంబ్రాయిడరీ జాకెట్ ,ధోతీ స్కర్ట్ ఉన్నాయి. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా సోనాక్షి సిన్హా సిల్వర్ ఆక్సిడైజ్డ్ చోకర్ నెక్‌లెస్ పెట్టుకుని, రెడ్ ఫ్లోరల్ కఫ్స్ ,గోల్డెన్ పొట్లీ బ్యాగ్ ను పట్టుకుని తన రూపాన్ని మరింత్ గ్లామరస్‌గా మార్చింది.

సోనాక్షి సిన్హా తన సార్టోరియల్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. అకేషన్ ను బట్టి డ్రెస్ అవుతూ అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్‌గా జరిగిన నిర్మాత రమేష్ తౌరానీ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు సోనాక్షి ఈ అవుట్ ఫిట్ వేసుకుంది.

దివా ఆకర్షణీయమైన దుస్తులలో సూపర్ స్టైలిష్‌గా కనిపించి ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా పాదాలకే గోధుమ రంగు హీల్స్, పెదాలకు న్యూడ్ లిప్ కలర్, కనులకు స్మోకెడ్ ఐ లైనర్ వేసుకుని స్టన్నింగ్ లుక్స్ తో కెవ్వుకేకమనిపించింది.