Sonam Kapoor : బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అనగానే వెంటనే పొడవుకాళ్ల సుందరి నటి సోనమ్ కపూర్ పేరే ఇప్పటికీ వినిపిస్తుంది. ఆమె ఫ్యాషన్‌తో చేసే ప్రయోగాలు మామూలుగా ఉండవు. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ అయినా మోడ్రన్ దుస్తులైనా ఈ భామ ధరించి ప్రతి అవుట్‌ఫిట్ అందరిని అమితంగా అట్రాక్ట్ చేస్తుంది. పెళ్లై ఓ పాప పుట్టినా ఈ భామ ఇప్పటికీ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా తనదైన హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ చిన్నది.
సోనమ్ కపూర్ తాజాగా చేసిన ఓ ఇన్‌డోర్ ఫోటో షూట్ కోసం డీప్ పర్పుల్ త్రీ పీస్ కోట్ స్కర్ట్ సెట్ ధరించంది. ఈ ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాషన్ ప్రయుల హృదయాలను గెలుచుకుంది. శీతాకాలపు వార్డ్‌రోబ్ నుంచి ఈ అందమైన అవుట్‌ఫిట్‌ను సెలెక్ట్ చేసుకుని ఫ్యాషన్ లవర్స్‌ను ఫిదా చేసేసింది. ఓ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు సోనమ్ కస్టమ్ ఫిట్‌ను ధరించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.
సోనమ్ కస్టమ్-మేడ్ దుస్తులను ఫ్యాషన్ లేబుల్ యాంటిథెసిస్ షెల్ఫ్‌ల నుండి ఎన్నుకుంది. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ సోదరి, రియా కపూర్ ప్రముఖ స్టైలిస్ట్‌లు మనీషా మెల్వానీ , సన్యా కపూర్ వింటర్-రెడీ చిక్ లుక్ లో సోనమ్ ను స్టైల్ చేసారు. మీకు స్టైల్ ఉండాలి అని సోనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డయానా వ్రీలాండ్ కోట్‌తో ఫోటోషూట్‌ను పోస్ట్ చేసింది.
సోనమ్ డీప్ పర్పుల్ త్రీ-పీస్ సెట్‌లో అదిరిపోయింది. పొడవుగా ఉన్న ట్రెంచ్ కోట్, బటన్ డౌన్ వెయిస్ట్‌కోట్ , ఫ్లేర్డ్ మిడి స్కర్ట్ ను తన ఫోటో షూట్ కోసం ధరించింది ఈ చిన్నది ఇమ్మాక్యులేట్ టైలరింగ్‌తో ప్రీమియం ఊల్ క్రీప్ బ్లెండ్‌లో తయారు చేయబడిన ఈ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్యాడెడ్ షోల్డర్‌లు, ఫుల్-లెన్త్ స్లీవ్‌లు, ఓపెన్ ఫ్రంట్ తో టైలర్డ్ ఫిట్టింగ్ తో వచ్చిన కోట్‌లో రాయల్ లుక్‌లో కనిపించి అదరగొట్టింది సోనమ్. ప్లీటెడ్ సిల్హౌట్ ,మిడి లెన్త్ స్కర్ట్‌లో అదుర్స్ అనిపించింది.
సోనమ్ ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా బ్లాక్ స్వెడ్ బూట్‌లు ధరించింది. మ్యాచింగ్ గా టాప్ హ్యాండిల్ బ్లాక్ బ్యాగ్ వేసుకుంది. విలువైన రాళ్లతో పొదిగిన క్రాస్ ఆకారపు ఇయర్‌రింగ్స్‌ను అలంకరించుకుంది. చేతి వేళ్లకు మ్యాచింగ్ స్టేట్‌మెంట్ రింగ్‌లను పెట్టుకుని తన లుక్‌ను పూర్తి చేసింది. హెయిర్‌ను లూజ్‌గా వదులుకుని, కనులకు సూక్ష్మమైన ఐ షాడో, వింగెడ్ ఐలైనర్, న్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుని పర్ఫెక్ట్ లుక్‌తో ట్రెండ్ సెట్ చేసింది.