Sonam Kapoor : సోనమ్ కపూర్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో అభిమానుల కోసం తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను నిరంతరం పంచుకుంటూ ఉంటుంది. సాధారణ అవుట్ ఫిట్స్ నుండి సీజన్ లకు అనుగుణంగా ఎలా డ్రెస్ అవ్వాలో ఈ భామకు బాగా తెలుసు. ఆమె ఎత్నిక్ ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను చూస్తే సోనమ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు యిట్టె అర్థమవుతాయి. నటి రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ ఫ్యాషన్ షూట్ కోసం సోనమ్ కపూర్ ఫ్యాషన్ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లాకు మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ ఫ్యాషన్ ఫోటోషూట్ లో అద్భుతమైన ఎత్నిక్ శారీని ఎన్నుకుంది ఈ బ్యూటీ.

సిల్వర్ జరీ బార్డర్‌లలో, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ తో , వెండి సీక్విన్ వివరాలను కలిగిన పెర్ల్ వైట్ చీరలో ఏంజెల్ లా మెరిసింది సోనమ్. ఆమె ఒక భుజంపైన తెలుపు రేషమ్ థ్రెడ్‌లలో భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిన తెల్లటి దుపట్టాను జోడించి తన రాయల్టీ లుక్ తో అదరగొట్టింది.

ఈ చీరకు తగ్గట్లుగా మెడలో ఒక స్టేట్‌మెంట్ పెర్ల్ ఎంబెడెడ్ నెక్ చోకర్ ను అలంకరించుకుంది. దానికి మ్యాచ్ అయ్యేలా చెవులకు వైట్ ఇయర్ స్టడ్‌లు పెట్టుకుంది. చేతులకు ఎర్రటి బ్యాంగిల్స్ , చేతి వేళ్ళకు డైమండ్ ఫింగర్ రింగ్స్ పెట్టుకుని తన రూపాన్ని మరింత అట్రాసిటివ్ గా మార్చుకుంది.

సోనమ్ తన కురులను మధ్య భాగాన పాపిట తీసి లూస్ గా వదులుకుంది. ఈ శారీ కి సెట్ అయ్యేలా మేకోవర్ అయ్యింది సోనమ్ కపూర్, కనులకు పింక్ ఐషాడో, బ్లాక్ వింగేడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా పెట్టుకుంది. పెదాలకు పాస్టెల్ పింక్ లిప్‌స్టిక్ దిద్దుకుని గిల్మోర్స్ లుక్స్ తో ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచేసింది ఈ చందమామ.