కరోనా సమయంలో నటుడు సోనూసూద్ అందించిన నిస్వార్ధ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆపదలో ఉన్నామంటూ ఆయన దృష్టికి తీసుకువస్తే… చాలు ఆపన్న హస్తం ముందున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక బస్సు లను సైతం ఏర్పాటు చేసి పంపించారు.
వారికి మంచినీరు ఆహారం అందజేశారు. అంతేకాకుండా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని ట్వీట్ చేసిన వారికి పెద్దన్నగా ముందున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు లేవన్నవారికి కూడా తనదైన రీతిలో సహాయం చేశారు. ఇలాంటి సోను సూద్ ఈ యుద్ధ నేపథ్యంలోనూ తనదైన రీతిలో సహాయం చేస్తున్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు సోనూసూద్ చారిటీ బృందం సాయం అందిస్తుంది. అక్కడ చిక్కుకున్న వారిని సరిహద్దులకు చేర్చడానికి సహాయం అందిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్ వరకు అక్కడ ఉన్న విద్యార్థులను తీసుకొస్తున్నారు. ఇందుకోసం సోనూసూద్ చారిటీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్నామని ఓ చిన్న మెసేజ్ పెడితే చాలు.. చారిటీ సభ్యులు వారి చెంతకు చేరి… ఆపన్నహస్తం అందచేస్తున్నారు.
సోనూసూద్ సాయం తో భారత్ కు వస్తున్న ఓ విద్యార్థి ఉద్వేగ మైన పోస్ట్ చేశారు. స్వదేశానికి వస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉందన్నారు. అంతేకాకుండా సోనూసూద్ టీమ్ సాయం వల్లే తాను ఇవాళ తానూ ఇంటికి వస్తున్నందుకు కారణం సోనూసూద్ అని చెప్పుకొచ్చారు.
సోనూసూద్ సాయంపై ఆమె ఆనందం పడ్డారు. ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసి… ఆమె ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీనిపై సోనూసూద్ రియాక్ట్ అయ్యారు. ఇది తన బాధ్యత అంటూ చెప్పారు. తనవంతుగా భారతీయులకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెపుతూ కామెంట్ చేశారు.
సోనూసూద్ టీం సాయం చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వారి సాయంతో స్వదేశానికి వస్తున్న విద్యార్థుల వీడియో సందేశాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనూసూద్ సాయం మరోసారి ట్రెండింగ్ అవుతుంది. సోనూసూద్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిస్తున్నారు. నీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.